జుల్కర్‌నైన్ హైదర్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జుల్కర్‌నైన్ హైదర్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1986 ఏప్రిల్ 23|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 201) | 2010 ఆగస్టు 6 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 179) | 2010 అక్టోబరు 29 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 నవంబరు 5 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 15) | 2007 ఫిబ్రవరి 3 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 అక్టోబరు 27 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 2013 డిసెంబరు 12 |
జుల్కర్‌నైన్ హైదర్ (జననం 1986, ఏప్రిల్ 23) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. పాకిస్తాన్ జాతీయ జట్టు కోసం ఆడాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో నాల్గవ వన్డేలో చివరి వికెట్ తర్వాత నాటకీయంగా ప్రకటించాడు. బుకీల బెదిరింపులకు భయపడి లండన్‌కు పారిపోయాడు.
జననం, వ్యక్తిగత జీవితం
[మార్చు]హైదర్ 1986, ఏప్రిల్ 23న పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. తన 12వ ఏట 1998లో ఇతని తల్లి క్యాన్సర్‌తో మరణించింది. షౌకత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌కి తన తొలి టెస్ట్ మ్యాచ్ నుండి సగం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.[1] 2010, ఆగస్టులో, హెపటైటిస్ సితో బాధపడుతున్న హైదర్ తండ్రి కోమాలోకి జారుకున్నాడు.[2]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]పాకిస్తాన్ అండర్-19 కోసం ఆడాడు. 2007 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం పాకిస్థాన్ 17 మంది సభ్యుల జట్టులోకి ఎంపికయ్యాడు.[3] తన ట్వంటీ20 అంతర్జాతీయ పర్యటనలో అరంగేట్రం చేసాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా పనిచేసిన అక్మల్ నుండి వికెట్ కీపింగ్ బాధ్యతలను స్వీకరించాడు. 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌కు కవర్‌గా సీనియర్ జాతీయ జట్టుకు పిలవబడ్డాడు. ఈ పర్యటనలో తన టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. కానీ వేలు విరగడంతో కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. సంవత్సరం తరువాత, దక్షిణాఫ్రికాపై తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. లాహోర్ బ్లూస్, పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ లిమిటెడ్ రెండింటికీ పాకిస్థానీ దేశీయ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున ఆడుతున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Haider donate's have his match fee for his mother". 12 August 2010. Archived from the original on 26 జూలై 2011. Retrieved 12 August 2010.
- ↑ Hoult, Nick (8 August 2010). "England v Pakistan: Zulqarnain Haider keeps his emotions in check to halt onslaught". The Telegraph. Retrieved 2011-10-18.
- ↑ Samiuddin, Osman (29 December 2006), Shoaib left out for South Africa tour, ESPNcricinfo, retrieved 2011-10-18