Jump to content

జెడబ్ల్యూ మారియట్ ముంబయి

వికీపీడియా నుండి
JW Marriott Hotel Mumbai
సాధారణ సమాచారం
ప్రదేశంJuhu Tara Road, Juhu, Mumbai India
ప్రారంభంJanuary, 2002
యాజమాన్యంMarriott International
ఇతర విషయములు
గదుల సంఖ్య356
సూట్ల సంఖ్య29
రెస్టారెంట్ల సంఖ్య5
పార్కింగ్Available
జాలగూడు
JW Marriott Mumbai

జెడబ్ల్యూ మారియట్ ముంబయి అనేది భారత దేశంలోని, ముంబయికి చెందిన మారియట్ గ్రూప్ నకు చెందిన ప్రముఖ హోటల్. దీనిని జెడబ్ల్యూ మారియట్ జూనియర్స్థాపించారు. దీనికి సహయజమానిగా రహేజా ఆతిథ్య సంస్థ వ్యవహరిస్తోంది. జెడబ్ల్యూమారియట్, ముంబయి అనేది భారత దేశంలో మొట్టమొదటి జెడబ్ల్యూ మారియట్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది.ఇది వివాహ పరమైన వేడుకలు, పుట్టినరోజు, ఇతర కార్యక్రమాల సేవలను కూడా అందిస్తోంది.[1]]ఎనిగ్మా పేరుతో ఈ హోటల్లో ఉన్న నైట్ క్లబ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడకు బాలీవుడ్ నటీ, నటులు వస్తుంటారు. జెడబ్ల్యు మారియట్, ముంబయి లోని ఖాన్ స్పా అనేది మారియట్ లోని బ్రాండ్ స్పాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.[2]

విషయ సూచిక

[మార్చు]
  1. హోటల్ గురించి
  2. చిరునామా
  3. హోటల్లో సదుపాయాలు-సేవలు
  4. ఇవి కూడా చూడండి
  5. బయటి లింకులు
  6. మూలాలు

హోటల్ గురించి

[మార్చు]

జెడబ్ల్యు మారియట్ హోటల్ –ముంబయి అనేది విలాసానికి మారుపేరుగాగా అద్భుతమైన అనుభూతినిచ్చే హోటల్ గా గుర్తింపు పొందింది. ముంబయి నగరంలోని అరేబియా సముద్రపు అందాలను ఈ హోటల్ నుంచి తిలకించడం సరికొత్త అనుభూతినిస్తుంది.[3]

చిరునామా

[మార్చు]

ఈ హోటల్ ముంబయిలోని జుహు బీచ్ లో ఉంది. ఈ హోటల్ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉంటుంది. వెర్సోవా బీచ్ కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ హోటల్ ఉంటుంది. ఎలిఫెంటా గుహలు, గేట్వే ఆఫ్ ఇండియా(సుమారు27 కిలోమీటర్ల దూరంలో ) వంటివి ఈ హోటల్ కు సమీపంలో ఉంటాయి.క్వీన్స్ నెక్ లెస్, సిద్ది వినాయక ఆలయం (సుమారు 15 కి.మీ.), హాజీ అలీ మజీద్(సుమారు15 కి.మీ).

ముంబయి ఎయిర్ పోర్టు నుంచి దూరం: సుమారు 9 కి.మీ. ముంబయి రైల్వే స్టేషన్ నుంచి దూరం: సుమారు 5 కి.మీ.

హోటల్లో సదుపాయాలు-సేవలు

[మార్చు]

రెస్టారెంట్

[మార్చు]
  • బార్
  • గది సేవలు
  • వై-ఫై
  • ఇంటర్నెట్
  • 24 గంటల చెక్ ఇన్
  • వ్యాపార కేంద్రం
  • వ్యాయామశాల(జిమ్)
  • కేఫ్
  • పూల్
  • ఎయిర్ కండీషనర్

ఈ హోటల్లో చాలా రెస్టారెంట్లలో నోరూరించే 5 స్టార్ ఆహార పదార్థాలు, భోజనం లభిస్తాయి.

  • అరోలా రెస్టారెంట్ లో స్పానిష్ వంటకాలు
  • లోటస్ కేఫ్ లో అంతర్జాతీయ స్థాయి ఆహార పదార్థాలు ఉంటాయి.
  • మెజ్జో మెజ్జోలో ఇటాలియన్ పదార్థాలు
  • సాఫ్రాన్ లో రాయల్ రుచులు,
  • స్పైసిస్ లో జపనీస్, చైనీస్ వెరైటీ వంటలు దొరుకుతాయి.
  • అంతేకాదు స్నాక్ బార్, కేఫ్ కూడా ఉన్నాయి. ఇతర వినోదాత్మక సౌకర్యాలు – స్పా, క్వాన్ స్పా, నైట్ క్లబ్, షాపింగ్ గ్యాలరీ, వ్యాయామ శాల, అవుట్ డోర్ పూల్స్ ఉన్నాయి.

ఈ 5 స్టార్ హోటల్లో 14,000 చదరపు అడుగుల వైశాల్యంలో కార్యక్రమాల నిర్వహణకు స్థలం ఉంది. ఇక్కడ వివాహ వేడుకలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పార్కింగ్ సదుపాయం ఉచితంగా పొందవచ్చు. ఇవి గాకుండా గిఫ్ట్ షాపులు, న్యూస్ స్టాండ్లు, గ్రంథాలయం, షటిల్ కోర్టులు, లాండ్రీ వంటి సదుపాయాలున్నాయి. జెడబ్య్లు మారియట్- ముంబయి హోటల్లోని దాదాపు 355 గదుల నుంచి అరేబయి సముద్ర అందాలను తిలకించేవచ్చు. ఈ గదులన్నీ ఎంతో అందంగా రూపొందించారు. వీటిలో సూపీరియర్ గదులు, ఎక్జిక్యూటివ్ గదులు, జుహు సూట్లు, లోటస్ సూట్, ఓసియన్ సూట్, వైస్ ప్రెసిడెన్షియల్ సూట్, ప్రెసిడెన్సియల్ సూట్ పేరుతో గదులను విభజించారు. అన్ని గదుల్లోనూ మినీ బార్, డెస్క్ లు, కాఫీ, టీ తయారీ సౌకర్యం, అంతర్జాతీయ కేబుల్ కనెక్షన్ తో కూడిన ఎల్.సి.డి. టీవీ, 2-లైన్ ఫోన్స్, డాటా-పోర్ట్, వాయిస్ మెయిల్ సౌకర్యం, సర్ ఛార్జీతో వై-ఫై సదుపాయం కూడా ఉన్నాయి. అతిథుల కోరిక మేరకు నిద్రలేపే కాల్ సౌకర్యం కూడా ఉంది. అధునాతన సదుపాయాలతో కూడిన స్నానాల గదులు, ప్రతీ గదిలో ఒక కింగ్ బెడ్, రెండు సింగిల్ బెడ్లు ఉంటాయి. ఈ హోటల్ డీలక్స్ గది వైశాల్యం 301 చదరపు అడుగుల(28 చదరపు మీటర్లు) ఉంటుంది. సముద్ర తీరం అందాలను, అలలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రం వద్ద ఉండే సందడి వంటి దృశ్యాలను చూడాలనుకునే అతిథుల కోసం ప్రత్యేక గదులుంటాయి. 42 అంగులాల ప్లాస్మా టీవీ, సర్ ఛార్జీతో కూడి వై-ఫై ఇంటర్నెట్ సేవలు ఈ గదుల్లోనూ లభిస్తాయి. వీటిలో ఒక కింగ్ బెడ్ ఉంటుంది. దీని వైశాల్యం 431 చదరపు అడుగులు ఉంటుంది. ఈ గదిలో ప్రత్యేకమైన బాత్ టబ్, షవర్ వంటి అధునాతన సదుపాయాలు ఉంటాయి. రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోయేలా ఈ హోటల్ గదులన్నీ తీర్చి దిద్దారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "MUMBAI". Quan Spa. Archived from the original on 2015-10-18.
  2. "MUMBAI". Marriott Hotels Rooms.
  3. "JW Marriott Hotel Mumbai". Cleartrip. 22 June 2015.
  4. "Family Travel". Marriott.

బయటి లింకులు

[మార్చు]