Jump to content

జెబా భక్తియార్

వికీపీడియా నుండి
జెబా భక్తియార్
زيبا بختيار
జెబా భక్తియార్
జననం
జెబా భక్తియార్
జీవిత భాగస్వామి
సల్మాన్ గాలియని
(m. 1982, divorced)
(m. 1989; div. 1990)
అద్నాన్ సామీ
(m. 1993; div. 1997)
సోహైల్ ఖాన్ లేగారి
(m. 2008)

| children = అజాన్ }} జెబా భక్తియార్ (ఉర్దూ:زيبا بختيار) ఒక పాకిస్తానీ సినిమా, టెలివిజన్ నటి. ఈమె పాకిస్తాన్ టివి (PTV)లో అనార్కలి అనే నాటకం ద్వారా 1988లో తొలిసారి టెలివిజన్‌లో నటించింది.[1] 1991లో హెన్నా చిత్రంద్వారా సినీరంగప్రవేశం చేసింది.[2] ఈమె ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అద్నాన్ సామీని వివాహం చేసుకుని విడాకులు తీసుకోవడం ద్వారా వార్తలలోకి ఎక్కింది.[2]

నటనా వృత్తి

[మార్చు]

ఈమె టెలివిజన్ నాటకం అనార్కలి(1988)లో నటించిన తర్వాత రణధీర్ కపూర్ నిర్మించి దర్శకత్వం వహించిన హెన్నా (1991) అనే భారతీయ సినిమాలో నటించింది.[ఆధారం చూపాలి] సర్‌గమ్‌(1995) చిత్రంలో నటనకు ఈమెకు "నిగార్ అవార్డు" లభించింది.[ఆధారం చూపాలి]

ఈమె "మొహబ్బత్‌కీ అర్జూ"(1994), "స్టంట్ మాన్"(1994), "జై విక్రాంత"(1995) మొదలైన భారతీయ సినిమాలలో నటించింది కానీ ఆ చిత్రాలేవీ విజయవంతం కాలేక పోయాయి.[ఆధారం చూపాలి] తరువాత ఈమె పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లి "ముఖద్దమ" (1996), "ఛీఫ్ సాహిబ్" (1996), "ఖైద్" (1996), "బాబు" (2001) మొదలైన సినిమాలలో నటించింది.[ఆధారం చూపాలి] ఈమె 2001లో "బాబు" చిత్రానికి దర్శకత్వం వహించింది కానీ రాణించలేక పోయింది.[ఆధారం చూపాలి]

భక్తియార్ టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.[ఆధారం చూపాలి] "పెహ్లీ సీ మొహబ్బత్" అనే సీరియల్‌లో ఈమె వికలాంగురాలిగా నటించింది. ఈమె ఇంకా "కుండి" (1994), "సర్గమ్‌" (1995) మొదలైన "లాలీవుడ్" సినిమాలలో కూడా నటించింది.[ఆధారం చూపాలి]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జెబా భక్తియార్ మాజీ అటార్నీ జనరల్ యాహ్యా భక్తియార్‌ కుమార్తె.[3] ఈమె తల్లి హంగేరియన్ దేశస్థురాలు, తండ్రి "క్వెట్టా"కు చెందిన పఠాన్ జాతికి చెందినవాడు. ఈమె 1997లో గాయకుడు అద్నాన్ సామీని వివాహం చేసుకుంది. కానీ 1997లో వారు విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు అజాన్ అనే కుమారుడు జన్మించాడు.[2][1][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర
1991 హెన్నా హెన్నా
1991 దేశ్‌వాసి
1994 మొహబ్బత్‌ కీ ఆర్జూ పూనమ్‌ సింగ్
1994 స్టంట్ మాన్
1995 జై విక్రాంత నిర్మలా వర్మ
1995 సర్‌గమ్‌[1] జేబున్నీసా
1996 ముఖద్దమ చంచల్ సింగ్
1996 ఛీఫ్ సాహిబ్
1999 ఖైద్ ఖుష్బూ
2001 బాబూ
2001 ముసల్మాన్
2014 ఓ21[1] నిర్మాత
2015 బిన్ రోయె సబా తల్లి

టెలివిజన్

[మార్చు]
  • అనార్కలి (1988)- పాకిస్తాన్ టెలివిజన్ (PTV)
  • తాన్‌సేన్
  • లాగ్
  • ములాఖాత్
  • అబ్‌కే హమ్‌ బిచ్రె తౌ షాయద్
  • ముఖద్దస్ (1996)
  • మెహమాన్
  • షెహర్ ఎ దిల్ కే దర్వాజె
  • మౌమ్‌ (2010)
  • మసూరి
  • దూర్‌దేశ్
  • ఆయే మేరె ప్యార్ కీ ఖుష్బూ
  • ఇష్క్ కీ ఇబ్తిద
  • సంఝౌతా ఎక్స్‌ప్రెస్
  • హజారోఁ సాల్
  • బే ఇమాన్
  • టకౌనే
  • మా ఔర్ మమతా
  • బిన్ రోయే
  • ఆబ్లా పా
  • ఖరాష్
  • పెహ్లీ సీ మొహబ్బత్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 http://www.dawn.com/news/1142896, Profile of actress Zeba Bakhtiar on the Dawn newspaper, Published 10 November 2014, Retrieved 17 October 2016
  2. 2.0 2.1 2.2 http://www.tv.com.pk/celebrity/Zeba-Bakhtiar/331/biography, Retrieved 17 October 2016
  3. http://www.dawn.com/news/108677/yahya-bakhtiar-dies, Actress Zeba Bakhtiar and her father Yahya Bakhtiar on Dawn newspaper, Published 28 June 2003, Retrieved 17 October 2016
  4. https://tribune.com.pk/story/708857/the-buzz-in-conversation-with-zeba-bakhtiar/, 'The buzz: In conversation with Zeba Bakhtiar', The Express Tribune newspaper, Published 19 May 2014, Retrieved 19 March 2017

బయటి లింకులు

[మార్చు]