జె.నరేష్‌బాబు
ప్రపంచ ప్రసిద్ధి పొందిన స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ చే "బెస్ట్ స్పైనల్ సర్జన్" పురస్కారాన్ని అందుకున్న వెన్నుపూస వైద్య నిపుణులు డాక్టర్ నరేష్‌బాబు. ఈయన గుంటూరులోని మల్లికా స్పైన్ సెంటరులోను, హైదరాబాద్ లోని మెడిసిటీ ఆస్పత్రుల్లోను పనిచేస్తున్నారు. స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ ప్రతి సంవత్సరం వెన్నుపూస వైద్యంలో విశిష్టసేవలందించే ముగ్గురికి ఈ "బెస్ట్ స్పైనల్ సర్జన్" పురస్కారాన్ని ఇస్తుంది. 2014లో ఈ పురస్కారానికి భారతదేశం నుంచి డాక్టర్ నరేష్‌బాబు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఈయనతో పాటు ఎంపికైన మిగతా ఇద్దరు వైద్యులు లండన్, టర్కీలకు చెందినవారు.
చిన్నతనంలోనే వెన్నుపూస వంకర్లకు గురైన 15 మంది చిన్నారులకు వెన్ను వంపు సరి చేసి ఆ చిన్నారులు మామూలుగా ఎత్తుపెరిగేందుకు దోహదపడేలా కొత్త వైద్యాన్ని కనుగొన్నందుకు గాను ఈయనకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఈయన అమెరికాలోని అలస్కాలో అందుకున్నారు. సాధారణంగా అమెరికాలో వెన్నుపూస వంకర్ల శస్త్రచికిత్సకు 30 వేల డాలర్లు ఖర్చువుతుండగా, నరేష్ అమెరికాలో 1500 డాలర్లకే శస్త్రచికిత్స చేసి చూపించారు. తక్కువ కోతతో, రక్తస్రావం లేకుండా, వినూత్న పద్ధతిలో గ్రోత్‌రాడ్స్ (పెరిగే రాడ్లు) వేసి అక్కడి ప్రధాన విశ్వవిద్యాలయాల వైద్యులను ఆశ్చర్యపరచాడు. ఈయన స్ర్కేప్ సైటాలజీ పద్ధతి ద్వారా 8 నిమిషాల్లోనే కణితులను గుర్తించే ప్రక్రియను కూడా కనుగొన్నారు.
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - 28-10-2014 - ('ఉత్తమ స్పైనల్ సర్జన్' నరేష్‌బాబు - వెన్నువంకర్లు సరిచేసే వినూత్న చికిత్సకు స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ పురస్కారం)