జేన్ అల్-షరాఫ్ తలాల్
జేన్ | |
---|---|
![]() | |
జేన్, రాజా హుస్సేన్ (1941లో) | |
Tenure | జూలై 20, 1951 – ఆగస్టు 11, 1952 |
జీవిత భాగస్వామి | రాజా తలాల్ |
సంతతి | |
రాజా హుస్సేన్ యువరాజు ముహమ్మద్ యువరాజు హస్సాన్ యువరాణి బస్మా | |
రాజగృహం | హశేమిటే |
తండ్రి | షరీఫ్ జమాల్ బిన్ నస్సేర్ |
తల్లి | విజ్దాన్ షకీర్ పాషా |
జననం | 2 | 1916 ఆగస్టు
మరణం | 1994 ఏప్రిల్
26(వయసు 77) |
ఖననం | రఘడన్ స్థలం |
మతం | ముస్లిం |
జేన్ అల్-షరాఫ్ తలాల్ (ఆగస్టు 2, 1916 - ఏప్రిల్, 26 1994) జోర్డాన్ రాణి, రాజా తలాల్ భార్య, రాజా హుస్సేన్ కి కూడా తల్లి.
జననం - కుటుంబం[మార్చు]
జేన్ 1916, ఆగస్టు 2న షరీఫ్ జమాల్ బిన్ నస్సేర్, విజ్దాన్ షకీర్ పాషా దంపతులకు ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా లో జన్మించింది. ఈవిడ తండ్రి షరీఫ్ హౌరాన్ గవర్నర్, హుస్సేన్ బిన్ అలీ మేనల్లుడు. ఈవిడ తల్లి సైప్రస్ గవర్నరైన షిమ్మర్ పాషా కుమార్తె.
వివాహం - పిల్లలు[మార్చు]
1934, నవంబర్ 27న యువరాజు తాలాల్ బిన్ అబ్దుల్లా తో జేన్ వివాహం జరిగింది. వారికి నాలుగు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు.
- రాజా హుస్సేన్ (నవంబరు 14, 1935 - ఫిబ్రవరి 7, 1999)
- యువరాణి అస్మా (1937లో పుట్టినప్పుడు మరణం)
- యువరాజా ముహమ్మద్ (అక్టోబరు 2, 1940)
- యువరాజా హాసన్ (మార్చి 20, 1947)
- యువరాజా ముహ్సిన్ (మరణించారు)
- యువరాజా బాస్మా (మే 11, 1951)
ఇతర వివరాలు[మార్చు]
1950 ప్రారంభంలో జోర్డానియన్ సామ్రాజ్యం యొక్క రాజకీయ అభివృద్ధిలో రాణి జేన్ ముఖ్యపాత్ర పోషించింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మహిళల హక్కులకి పరిరక్షణకు కృషిచేసింది. 1952వ సంవత్సరంలో రాజ్యాంగం రచనలో పాల్గొని, మహిళలకవసరమైన కొన్ని హక్కులను అందులో ప్రవేశపెట్టింది. దేశ సామాజిక అభివృద్ధిని మెరుగుపరిచింది. 1944లో జోర్డాన్ యొక్క మొట్టమొదటి మహిళల సంఘాన్ని ఏర్పాటుచేసింది. 1948లో అరబ్-ఇస్రాయెల్ యుద్ధం తరువాత జోర్డాన్ కు వచ్చిన పాలస్తీనా శరణార్థుల కోసం జాతీయ సహాయ చర్యలు చేపట్టింది. 1948లో మహిళలకోసం జోర్డాన్ నేషనల్ రెడ్ క్రెసెంట్ సొసైటీ శాఖను స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించింది.
గౌరవాలు[మార్చు]
జాతీయ గౌరవాలు[మార్చు]
- జోర్డాన్:
అల్ హుస్సేన్ బిన్ ఆలీ యొక్క కాలర్ డామే గ్రాండ్ కోర్దన్.[1]
- మలేషియా:
గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది డిఫెండర్ ఆఫ్ ది రెల్మ్ (SMN, ఏప్రిల్ 24 1965).[2]