జేమ్స్ డైసన్ అవార్డు - 2023

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు ( ఇండియా ) - 2023 ను తెలుగు యువకుడైన ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు[1]. వినూత్న ఉత్పత్తుల తయారీ, పనితీరులో యువకుడు చూపించిన ప్రతిభకు అవార్డు అందించినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది[2]. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతాలకు చెందిన ప్రవీణ్ కుమార్ ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ ఇంక్యుబేటర్ కేంద్రంగా మౌస్ వేర్ అనే అంకుర సంస్థలు నిర్వహిస్తున్నారు. సాంకేతికత, ఇతర డిజిటల్ పరికరాలు సైతం వాడలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల కోసం ఈ సంస్థ ప్రత్యేక పరికరాలను రూపొందిస్తుంది[3]. ' డెక్స్ ట్రోవేర్ డివైజెస్ ' అనే పిలిచే ఈ పరికరాల తన కదలిక ద్వారా సెన్సార్లను సేకరించే సమాచారాన్ని స్వీకరించి అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. జేమ్స్ డేసన్ అవార్డు యాజమాన్యం దివ్యాంగుల సమస్యలను ఇంజనీరింగ్ ద్వారా సులువైన పరిష్కారాలు ఆవిష్కరించే యువతను ప్రోత్సహిస్తుంది. జేమ్స్ డేసన్ అవార్డుకు సంబంధించి భారత విజేతగా నిలిచిన ప్రవీణ్ ప్రపంచ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

మూలాలు :

  1. sailakshmi (2023-09-14). "James Dyson Award (India)-2023 was won by Telugu youth Praveen Kumar | జేమ్స్ డైసన్ అవార్డు (ఇండియా)-2023ను తెలుగు యువకుడైన ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు". adda247. Retrieved 2023-11-06.
  2. "Chennai based engineer wins James Dyson Award (India) 2023". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-13. Retrieved 2023-11-06.
  3. "Young Indian engineer's innovation to empower people with disabilities announced as National Winner of James Dyson Award 2023". India Education | Latest Education News | Global Educational News | Recent Educational News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-06.