జే.ఎస్.డబ్ల్యూ స్టీల్
రకం | సార్వజనిక |
---|---|
బి.ఎస్.ఇ: 500228 NSE: JSWSTEEL | |
పరిశ్రమ | ఉక్కు |
స్థాపన | 1982 |
స్థాపకుడు | సజ్జన్ జిందాల్ (Chairman) |
ప్రధాన కార్యాలయం | ముంబై, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
కీలక వ్యక్తులు | MVS శేషగిరి రావు, డా. వినోద్ నోవాల్ |
ఉత్పత్తులు | ఉక్కు, చదును ఉక్కు, పొడవాటి ఉక్కు, తీగ ఉక్కు ఉత్పత్తులు, రేకులు |
రెవెన్యూ | ₹84,757 crore (US$11 billion) (2019)[1] |
₹11,168 crore (US$1.4 billion) (2019)[1] | |
₹7,639 crore (US$960 million) (2019)[1] | |
Total assets | ₹1,04,902 crore (US$13 billion) (2019)[1] |
Total equity | ₹35,162 crore (US$4.4 billion) (2019)[1] |
ఉద్యోగుల సంఖ్య | 12,599 (2019)[1] |
మాతృ సంస్థ | జే.ఎస్.డబ్ల్యూ గ్రూప్ |
వెబ్‌సైట్ | www |
జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ (BSE: 500228, NSE: JSWSTEEL) ముంబై కేంద్రంగా పనిచేస్తున్న, భారతీయ ఉక్కు తయారీ సంస్థ. [2] ఇస్పాత్ ఉక్కు కర్మాగారం విలీనంతో, జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ భారతదేశపు రెండవ అతిపెద్ద ప్రైవేటు ఉక్కు ఉత్పత్తిదారుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం సంస్థ కర్మాగరాలు ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం 18 మి.టన్నులు (ఏడాదికి)[3] ఉక్కు, సిమెంటు, విద్యుత్, నిర్మాణాలు, క్రీడారంగాలలో పెట్టుబడులున్న జే.ఎస్.డబ్ల్యూ గ్రూప్ లో జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ ఒక భాగం.
1982 లో జిందాల్ సంస్థ మంబై దగ్గరలోని వసింద్ వద్ద, మొదట్టి ఉక్కు కర్మాగారాన్ని స్థాపించిన కొద్దికాలానికి తారాపూర్ వద్ద చిన్న ఉక్కు మిల్లును నిర్వహింస్తున్న పిరామల్ స్టీల్ లి. ను చేజిక్కించుకుని, జిందాల్ ఇనుము & ఉక్కు సంస్థగా అవతరించింది(JISCO). 1994 సంవత్సరంలో, కర్నాటక-ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులలోని తోరణగల్లు, (బళ్ళారి జిల్లా) వద్ద జిందాల్ విజయనగర్ ఉక్కు లి. (JVSL). బళ్లారి-హోస్పేట ప్రాంతం., ఆంధ్ర ప్రదేశ్ లోని కొద్ది భాగంలోని విశాలమైన ముడి ఇనుము నేలల్లో, 3700 ఎకరాలలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయబడింది. బెంగుళూరు క్ 340 కి.మీ దూరంలో ఉన్న కర్మాగారానికి గోవా, చెన్నై, కృష్ణపట్నం, మంగుళూరు ల నుండి రైలు సౌకర్యం ఉంది. 2005 సం.లో, JISCO, JVSL విలీనం ద్వారా జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ ఏర్పడింది.
ఉత్తమమైన ఆటోగ్రేడ్ ఉక్కు ఉత్పత్తికోసం జపాన్ కు చెందిన JFE ఉక్కు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. చిలీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మొజాంబిక్ లలోని ఇనుము గనులు కొన్నిటిని సంస్థ చేజిక్కించుకున్నది.
కర్మాగారాలు
[మార్చు]విజయనగర్ కర్మాగారం (తోరణగల్లు)
[మార్చు]జే.ఎస్.డబ్ల్యూ విజయనగర్ ఉక్కు కర్మాగారం 12 మి.టన్నుల (ఏడాదికి) ఉత్త్పత్తి సామర్థ్యంతో భారతదేశంలోనే అతిపెద్ద సమీకృత ఉక్కు కర్మాగారము. భారతదేశంలో కోరెక్స్ పరిజ్ణానాన్ని వాడుతున్న మొట్టమొదటి కర్మాగారము.
ఇతర ముఖ్యమైన విషయాలు:
- భారతదేశంలో హరిత ఉక్కుని మొట్టమొదటిసారిగా ఉత్పత్తి చేసి, ప్రపంచపు కోరెక్స్ ప్రదర్శనశాల గా పేరొందింది.
- కొద్దికాలంపాటు, భారతదేశపు అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ ని కలిగి ఉంది, అత్యంత విశాలమైన హాట్ స్ట్రిప్ మిల్లుని కలిగి ఉంది.
- సగటున ఏడాదికి 800 టన్నుల పైగా(ప్రతీ కార్మికునికి), భారతదేశపు అత్యుత్తమ ఉత్పాదకత ను కలిగి ఉంది.
- 95 % పైగా పారిశ్రామిక జలన్ని పునర్వినియోగిస్తూ, "సున్నా వ్యర్థాల విడుదల" గుర్తింపు కలిగి ఉంది.
ఇతర కర్మాగారాలు
[మార్చు]- డోల్వి కర్మాగారం
- సేలం కర్మాగారం
- తారాపూర్ కర్మాగారం
- వసింద్ కర్మాగారం
- కల్మేశ్వర్ కర్మాగారం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "JSW Steel Ltd Annual Report PDF 2018-19" (PDF), JSW Steel Ltd[permanent dead link]
- ↑ "Get in touch with JSW Group Companies". Jsw.in. Archived from the original on 19 డిసెంబరు 2010. Retrieved 19 అక్టోబరు 2019.
- ↑ "JSW Steel has become the second largest steel producer in the country after state-owned Steel Authority of India (SAIL)". economictimes.com. Archived from the original on 2015-01-17. Retrieved 2013-06-03.