జోగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 10 వ కులం జోగి . జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని సామెత. జోగులు విభూతి ధారులై ఉండొచ్చు. స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన ఆనాటి మత విధానాలు బసివి, జోగిని వ్యవస్థలకు ప్రాణం పోశాయి. క్రమేణా జోగి ఒక కులంగా మారింది. శివుడిని బీరజడల జోగి అంటారు. జోగులు శైవులు.జోగి కులస్తులు జీవనం కోసం రాయలసీమలో అర్చకత్వాన్ని ఆసరాగా చేసుకుం టే... శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయంలో స్థిరపడ్డారు. మరికొందరు బిక్షాటన…ను ఎంచుకోగా... అత్యధికులకు మాత్రం మూలికా వైద్యమే జీవనాధారం. .కొందరు ఈత చాపలు కూడా చేస్తుంటారు. జోగి అనగానే జోగినీ వ్యవస్థకు చెందిన కులంగా సమాజం భావించి, అదోలా చూస్తోంది. దీంతో స్థాని కంగా ఉన్న బిసీ కులాల్లోని పెద్ద కులాన్ని ఎంచుకుని... అదే తమ కులమని చెప్పుకుంటూ... వారిలో క్రమేణా కలిసిపోతున్నారు.గతంలో జోగి కులస్తులు భుజం మీదినుం చి కిందికి జాలువారే పొడవాటి వస్త్రాన్నో, చీరనో వేసుకు నేవారు.వనమూలికలతో కూడిన జోలె... మరోపక్క కొండచిలవనో, పసరిక పామునో భుజంపై వేసుకుని వీధుల వెంట తిరుగుతూ మందులు అమ్ముతుంటారు. కాలానుగుణంగా వీరి వేషధారణలో మార్పు వచ్చింది. అనుకూలంగా ఉంటేనే ఆయా గ్రామాల్లో ఉంటారు. లేదంటే మరో గ్రామానికి వెళతారు. వీరి వైద్యంలో వనమూలికల ప్రాధాన్యమే ఎక్కువగా ఉన్నా... మూర్చ రోగికి మాత్రం నొసటిపై కాల్చి వైద్యం చేస్తారు. విషానికి విరుగుడు మందు వీరి వెంట ఎప్పుడూ ఉంటుంది. వివిధ రకాల వనమూలికలూ వీరి వద్ద లభిస్తాయి. దీంతో ఆయుర్వేద వైద్యులు మూలికల కోసం వీరిని ఆశ్రయిస్తుంటారు. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌ దగ్గర వీరిని జడిబుడివాలా' లుగా పిలుస్తుంటారు.రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇప్పటికీ మేరల పద్ధతి కొనసాగుతోంది. భూస్వాముల పశువులకు వైద్యం చేస్తారు. ఏడాది మొత్తం వైద్యం అందించినందుకు వీరికి భూస్వామి పంట కోత కోశాక ఒక మోపు ఇస్తాడు.కొందరు తల్లిదండ్రులు తినీతినక తమ కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పీజీలు పూర్తి చేశారని బిడ్డలను చూసి సంబరపడిపోయారు. అయితే వీరికి పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభిస్తే తగిన వరుడే దొరకట్లేదు.ఎరమ్రట్టి నేలపై వర్షం కురిస్తే... పెండలం పురుగు మాదిరి పురుగులు మట్టిలోంచి బయటికి వస్తాయి. వీటి చర్మంపై ఉండే సన్నటి నూగు ముఖమల్‌ వస్త్రం మాదిరీ మెరుస్తుంటుంది. వీటిని పట్టి వేయించి, ప్యాక్‌ చేసి అమ్ముతారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం ఊపు అందుకోవటంతో ఈ పురుగులు అంతరించే స్థితి దాపురించింది.వనమూలికలను గుర్తించే పరిజ్ఞా నం ఉన్న జోగి కులస్తులకు నర్సరీ లలో శిక్షణ ఇప్పించాలి వనమూలికల అమ్మకాల నిమిత్తం డ్వాక్రా గ్రూపులు తయారు చేసిన వస్తువులను మార్కెట్‌ చేసేందుకు ఏ విధంగా అవకాశం కల్పిస్తు న్నారో... వీరికీ అలాంటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.మహబూ బూనగర్‌ కొడంగల్‌ మండలం ఆషన్‌పల్లి సర్పంచ్‌ మినహా మా కులానికి ఎక్కడా ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదంటున్నారు.రాజధానిలో మా కులంవారి కోసం ఓ కమ్యూనిటీ హాలు నిర్మిం చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. జొగి కులస్తులలో విద్యపట్ల అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మా కులానికి చెందిన వారు కుల ధ్రువీ కరణ పత్రాలు పొందాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జోగి&oldid=3266219" నుండి వెలికితీశారు