జోగినిపల్లి దామోదర్‌రావు
జోగినిపల్లి దామోదర్‌రావు కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ అనుబంధ పోతారం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే [1][2]
జీవిత విశేషాలు[మార్చు]
జోగినిపల్లి దామోదర్‌రావు బుగ్గారం (ప్రస్తుత ధర్మపురి నియోజకవర్గం) నుంచి 1972-1977 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. జనతా పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు[3]. 1978 ఎన్నికలలో జగిత్యాల శాసనసభ నియోజక వర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ సురేంద్రరావు చేతిలో ఓడిపోయారు.[4] నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేయించుకొని, పనులు చేయించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన నేతగా పేరు సంపాదించారు. మొదట్లో తిర్మలాపూర్ సర్పంచ్‌గా పనిచేశారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సహకరించడంతోపాటు తిర్మలాపూర్ పంచాయతీ పరిధిలోని పోతారం, సంద్రాలపల్లి, దమ్మాయపేటకు కరెంటు రావడానికి ఎంతో కృషిచేశారు. ఆయన భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో రాష్ట్ర బాధ్యుడిగా కొనసాగారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆయనకు భార్య సరోజన ఉన్నారు. పిల్లలు లేకపోవడంతో తమ్ముడి కొడుకు హరీందర్‌ను దత్తత తీసుకున్నారు.
మరణం[మార్చు]
ఆయన అనారోగ్యంతో తన 81వ యేట జనవరి 30 2016 న హైదరాబాదులో కన్నుమూశారు.[5]
మూలాలు[మార్చు]
- ↑ మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రావు కన్నుమూత PUBLISHED: SUN,JANUARY 31, 2016 01:07 AM namasthetelangaana.com
- ↑ Pension for Ex-Legislatures
- ↑ List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1972 - See more at: http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1972-election-results.html#sthash.Gq31hl07.dpuf
- ↑ Election Commission of India Partywise Comparison Since 1978
- ↑ మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రావు మృతి 31-01-2016 03:00:14 andhrajyothy.com