Jump to content

జోష్ ఇంగ్లిస్

వికీపీడియా నుండి
జోష్ ఇంగ్లిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జోష్ పాట్రిక్ ఇంగ్లిస్
పుట్టిన తేదీ (1995-03-04) 1995 మార్చి 4 (వయసు 29)
లీడ్స్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్-batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 237)2022 జూన్ 24 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.48
తొలి T20I (క్యాప్ 99)2022 ఫిబ్రవరి 11 - శ్రీలంక తో
చివరి T20I2023 సెప్టెంబరు 3 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.48
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–presentవెస్టర్న్ ఆస్ట్రేలియా
2017/18–presentపెర్త్ స్కార్చర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 FC లిఎ
మ్యాచ్‌లు 3 9 52 31
చేసిన పరుగులు 41 220 2,466 1,045
బ్యాటింగు సగటు 13.66 27.50 32.88 36.06
100లు/50లు 0/0 0/0 4/12 1/8
అత్యుత్తమ స్కోరు 26 48 153* 138
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 4/0 176/3 40/6
మూలం: Cricinfo, 22 March 2023

జాషువా పాట్రిక్ ఇంగ్లిస్ (జననం 1995 మార్చి 4) వికెట్ కీపింగు, కుడిచేతి వాటం బ్యాటింగు చేసే ఆస్ట్రేలియా క్రికెటరు. [1] ఇంగ్లిస్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జన్మించాడు. 14 సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో పాటు, ఆస్ట్రేలియా వెళ్లాడు.[2] ఇంగ్లిస్ 2021 T20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు, కానీ టోర్నమెంట్‌లో ఏ ఆట ఆడలేదు. అతను 2022 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [3]

జీవిత చరిత్ర

[మార్చు]

2015 డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వెస్టిండియన్లపై క్రికెట్ ఆస్ట్రేలియా XI కోసం ఇంగ్లిస్ తన ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[4] అతను 2017 జనవరిలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పాకిస్థానీలకు వ్యతిరేకంగా క్రికెట్ ఆస్ట్రేలియా XI కోసం లిస్టు A లో అడుగుపెట్టాడు.[5] 2017 డిసెంబరు 23న 2017–18 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ట్వంటీ20 ల్లో ప్రవేశించాడు.[6]

2020 అక్టోబరులో, 2020–21 షెఫీల్డ్ షీల్డ్ సీజన్ ప్రారంభ రౌండ్‌లో, సౌత్ ఆస్ట్రేలియాపై 153 నాటౌట్‌తో ఇంగ్లిస్ తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీ సాధించాడు. [7] 2021 మార్చిలో, ఇంగ్లాండ్‌లో 2021 T20 బ్లాస్టు టోర్నమెంట్‌లో ఆడేందుకు ఇంగ్లిస్‌ని లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తీసుకుంది. [8] 2021 జూన్‌లో ఇంగ్లిస్, ఒక T20 మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున 103 నాటౌట్‌తో తన మొదటి సెంచరీ సాధించాడు. [9] అతను వోర్సెస్టర్‌షైర్‌పై 61 బంతుల్లో అజేయంగా 118 పరుగులతో తన రెండవ T20 సెంచరీని సాధించాడు. [10]

2021 ఆగస్టులో, ఇంగ్లిస్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో, జాతీయ జట్టుకు తన తొలి పిలుపులో ఎంపికయ్యాడు. [11] 2022 జనవరిలో, శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం ఆస్ట్రేలియా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఇంగ్లిస్‌ని చేర్చారు. [12] ఇంగ్లిస్ తన T20I 2022 ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియా తరపున శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ఆడాడు. [13] అదే నెలలో ఇంగ్లిస్, పాకిస్తాన్ పర్యటన కోసం ఆస్ట్రేలియా వన్ డే ఇంటర్నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు. [14] 2022 ఏప్రిల్లో, శ్రీలంక పర్యటన కోసం ఆస్ట్రేలియా వన్‌డే జట్టుకు కూడా ఇంగ్లిస్ ఎంపికయ్యాడు. [15] అతను 2022 జూన్ 24న శ్రీలంకపై ఆస్ట్రేలియా తరపున తన తొలి వన్‌డే ఆడాడు. [16]

మూలాలు

[మార్చు]
  1. "Josh Inglis". ESPN Cricinfo. Retrieved 2 December 2015.
  2. "Ashes: England-born Josh Inglis will not have split loyalties if picked by Australia". BBC Sport. Retrieved 29 November 2021.
  3. "Josh Inglis handed debut as Australia begin build-up to title defence". ESPN Cricinfo. Retrieved 11 February 2022.
  4. "West Indies tour of Australia, Tour Match: Cricket Australia XI v West Indians at Brisbane, Dec 2-5, 2015". ESPN Cricinfo. Retrieved 2 December 2015.
  5. "Pakistan tour of Australia, Tour Match: Cricket Australia XI v Pakistanis at Brisbane, Jan 10, 2017". ESPN Cricinfo. Retrieved 10 January 2017.
  6. "5th Match, Big Bash League at Sydney, Dec 23 2017". ESPN Cricinfo. Retrieved 23 December 2017.
  7. "Sheffield Shield: Western Australia's Josh Inglis, Ashton Agar notch twin tons two balls apart". The West Australia. Retrieved 11 October 2020.
  8. "Leicestershire add Josh Inglis to T20 Blast squad". The Cricketer. Retrieved 26 May 2021.
  9. "Josh Inglis hundred sees Leicestershire claim first win of campaign". ESPN Cricinfo. Retrieved 20 June 2021.
  10. "T20 Blast: Josh Inglis ton knocks Worcestershire out". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
  11. "Josh Inglis earns call-up and key names return in Australia's T20 World Cup squad". ESPN Cricinfo. Retrieved 19 August 2021.
  12. "Ben McDermott and Travis Head earn T20I call-ups for Sri Lanka series". ESPN Cricinfo. Retrieved 25 January 2022.
  13. "1st T20I (N), Sydney, Feb 11 2022, Sri Lanka tour of Australia". ESPN Cricinfo. Retrieved 11 February 2022.
  14. "Australia's Test quicks and David Warner rested from Pakistan limited-overs matches". ESPN Cricinfo. Retrieved 22 February 2022.
  15. "Pat Cummins rested for Sri Lanka T20Is; big guns return for white-ball leg". ESPN Cricinfo. Retrieved 29 April 2022.
  16. "5th ODI (D/N), Colombo (RPS), June 24, 2022, Australia tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 24 June 2022.