జోసెఫ్ కిట్టింగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోసెఫ్ డబ్ల్యూ. కిట్టింగర్ II
మారుపేరురెడ్
జననం(1928-07-27)1928 జూలై 27
టంపా, ఫ్లోరిడా, ఆమెరికా
మరణం2022 డిసెంబరు 9(2022-12-09) (వయసు 94)
ఓర్లాండో, ఫ్లోరిడా, అమెరికా
రాజభక్తిఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
సేవలు/శాఖ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్
సేవా కాలం1950–1978
ర్యాంకు సైనికాధికారి
పోరాటాలు / యుద్ధాలువియత్నాం యుద్ధం
పురస్కారాలు సిల్వర్ స్టార్ (2)
లెజియన్ ఆఫ్ మెరిట్ (2)
డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ (6)
బ్రాంజ్ స్టార్ (శౌర్యం) (3)
పర్పుల్ హార్ట్ (2)
మెరిటోరియస్ సర్వీస్ మెడల్
ఎయిర్ మెడల్ (24)
ప్రిజనర్ ఆఫ్ వార్ మెడల్
ఇతర సేవలురోసీ ఓ'గ్రాడీస్ ఫ్లయింగ్ సర్కస్ కోసం ఫ్లైట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ (1978–1992)

జోసెఫ్ విలియం కిట్టింగర్ II (ఆంగ్లం: Joseph William Kittinger II; 1928 జూలై 27 - 2022 డిసెంబరు 9) యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF)లో 1950 నుండి 1978 వరకు పనిచేచేసిన కమాండ్ పైలట్, ఆయన కల్నల్ హోదాతో పదవీ విరమణ చేసాడు. ఆయన 1960 నుండి 2012 వరకు అత్యధిక స్కైడైవ్ 102,800 అడుగుల (31.3 కిమీ) ప్రపంచ రికార్డును సాధించాడు.[1][2]

ఆయన 1956 నుండి 1960 వరకు ప్రాజెక్ట్ మ్యాన్‌హై, ప్రాజెక్ట్ ఎక్సెల్సియర్ హై-అల్టిట్యూడ్ బెలూన్ ఫ్లైట్ ప్రాజెక్ట్‌లలో పాల్గొన్నాడు. భూమి వక్రత(curvature of the Earth )ను పూర్తిగా చూసిన మొదటి వ్యక్తిగా గుర్తింపుపొందాడు.

వియత్నాం యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్, కిట్టింగర్ ఉత్తర వియత్నామీస్ మిగ్-21 జెట్ ఫైటర్‌ను కూల్చివేశాడు. అతను తరువాత కాల్చివేయబడ్డాడు, దీంతో ఉత్తర వియత్నామీస్ జైలులో 11 నెలలు యుద్ధ ఖైదీగా ఆయన గడిపాడు. తరువాత ఆయన 1973లో స్వదేశానికి తిరిగి చేరాడు.

1984లో, గ్యాస్ బెలూన్‌లో అట్లాంటిక్ మహాసముద్రం సోలో క్రాసింగ్ చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయన.

2012లో, జోసెఫ్ కిట్టింగర్ 84 ఏళ్ల వయసులో రెడ్ బుల్ స్ట్రాటోస్ ప్రాజెక్ట్‌లో క్యాప్సూల్ కమ్యూనికేటర్‌గా పాల్గొన్నాడు, ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్‌ను ఎర్త్ స్ట్రాటోస్పియర్ నుండి తన 24-మైలు (39 కిమీ) ఫ్రీఫాల్‌పై నడిపించాడు, ఇది తన 53 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. బామ్‌గార్ట్‌నర్ రికార్డును రెండు సంవత్సరాల తర్వాత అలాన్ యూస్టేస్ బద్దలు కొట్టాడు.[3]

మరణం[మార్చు]

94 ఏళ్ల వయసులో జోసెఫ్ కిట్టింగర్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 2022 డిసెంబరు 9న మరణించాడు.[4][5][6] అతను ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Space Men: They were the first to brave the unknown (Transcript)". American Experience. PBS. 1 March 2016. Retrieved 2 January 2019.
  2. Mission to the edge of Space — Red Bull Stratos — Trailer యూట్యూబ్లో
  3. Markoff, John (October 28, 2014). "15 Minutes of Free Fall Required Years of Taming Scientific Challenges". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved March 2, 2021.
  4. "USPA Mourns Passing of Joe Kittinger". United States Parachute Association. Retrieved 9 December 2022.
  5. "Joseph Kittinger, who set longtime parachute record, dies". AP via Washington Post. December 9, 2022.
  6. Richard Goldstein (December 9, 2022). "Joseph Kittinger, a Record-Setter High in the Skies, Dies at 94". The New York Times. Retrieved December 9, 2022.
  7. Colonel Joseph William Kittinger Jr