జ్యోతి వలబోజు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
జ్యోతి వలబోజు తెలుగు రచయిత్రి, ప్రచురణ కర్త. ఆమె తెలంగాణ ప్రభుత్వపు విశిష్టమహిళ 2019 పురస్కార గ్రహీత. ఆమె బ్లాగురాతలనుండి పత్రికా రచనల వరకు, మాలిక పత్రిక నిర్వహణ చేసింది. ఆమె స్నేహితురాలి పుస్తకంవంటల పుస్తకం ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో జె.వి.పబ్లికేషన్స్ పేరిట పబ్లిషింగ్ సంస్ధను ప్రారంభించింది.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె డిసెంబరు 22 న జన్మించింది. హైదరాబాదులోని సెయింట్స్ అన్స్ కళాశాలలో బి.కాం వరకు చదివింది. ఆమె మొదట ఒక బ్లాగర్ గా వృత్తి జివితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే పాక శాస్త్ర నిపుణిరాలిగా పేరొందింది. తెలంగాణ వంటలను చేయుటలో గుర్తింపు పొందింది. ఆమ బ్లాగరుగా, రచయితగా ఆముక్త మాల్యద, విజయ విలాసం వంతి కావ్యాలకు వ్యాఖ్యానం స్వరంతో సహా బ్లాగులో పొందుపరిచింది. ఆమె రచయిత్రిగా అంతర్జాల పత్రికను ప్రారంభించింది. తరువాత ప్రచురణ కర్తగా ఎదిగింది.
రచనలు
[మార్చు]- అమ్మకూ కావాలి[1]
- తెలంగాణ ఇంటి వంటలు (వెజ్) ఆవకాయలు ౩. తెలంగాణ ఇంటి వంటలు ( నాన్ వెజ్)
- ఈనాడు దినపత్రిక ఆహా పేజీలో కొన్ని ఆవకాయలు
- ఇట్స్ మై చాయిస్ - ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం 15,జూన్,2009
- జడ శతకం - శతక పద్యాలు
- స్వర రాగ గంగా ప్రవహమే -
కవితలు
[మార్చు]- అమ్మ
- అంకెలతో పద్య సంకెలలు - 2007, June 20
- ఎండలు ఎండలు
- ఆహా!! నోరూరగాయానమః
- జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు ప్రస్థానం.
ప్రచురణలు
[మార్చు]పబ్లిషర్స్ అనగానే పుస్తకాలు అచ్చువేసివ్వడం మాత్రమే కాకుండా రచయితలకు తమ పుస్తకాల ప్రచురణకు సంబంధించిన సేవలు అందించడమే జె.వి. పబ్లికేషన్స్ ముఖ్య ఉద్ధేశ్యం. రచయిత దగ్గర కంటెంట్, సొమ్ము ఉంటే చాలు. వారి రచనలు పుస్తక రూపంలో అచ్చు వేసి ఆ తర్వాత చేయవలసిన పనుల గురించిన సేవలు అందించడం లో పేరు మోసింది
ఇందులో పుస్తకానికి సంబంధించిన కాపీరైట్లు రచయిత దగ్గరే ఉంటాయి. ప్రచురణ విషయంలోనే సేవలు అందుబాటు రచయితలు తమ అభిరుచికి తగినట్టుగా, తమకు పూర్తిగా నచ్చినట్టుగా చేసుకునేలా గైడ్ చేయడం రచయితకు పూర్తిగా నచ్చిన తర్వాతే పుస్తకం ప్రింటింగ్ కి వెళుతుంది.
జె.వి.పబ్లికేషన్స్ నుండి వచ్చే ప్రతీ పుస్తకం మంచి క్వాలిటీతో అనుకున్న టైమ్ కి అందజేయడం జరుగుతుంది 2014 జనవరి నుండి ఇప్పటివరకు 205 పుస్తకాలను జె.వి.పబ్లికేషన్స్ నుండి ప్రచురించబడ్డాయి. ప్రచురణ 2014 లో ప్రారంభమైన జె వి పబ్లికేషన్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం "తెలంగాణ ఇంటివంటలు- వెజ్" అలాగే ఆ సంవత్సరంలో చివరిగా వచ్చిన పుస్తకం “ తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్”. ఇది ఇరవయ్యవ పుస్తకం. జె.వి.పబ్లికేషన్స్ నుండి ఎందరో రచయితలు, రచయిత్రుల పుస్తకాలను మంచి క్వాలిటీ తో ప్రచురించ జరిగింది.
1 | కొత్త (కరోనా) కథలు – 4 | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణ | 2020 |
2 | లిటిల్ డిటెక్టివ్ | 1998 - 99 సంవత్సరంలో ఉదయం వారపత్రికలో సీరియల్ | 2019 |
3 | అసమర్థురాలి అంతరంగం- | రజనీ సుబ్రహ్మణ్యం | |
4 | ఆకుపాట | శ్రీనివాస్ వాసుదేవ్ | |
5 | కవితాచక్ర నివేదన | 2018 |
మూలాలు
[మార్చు]- ↑ "జ్యోతి వలబోజు". lit.andhrajyothy.com.