జ్యోత్స్నా పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జ్యోత్స్నా పటేల్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్ క్రికెటర్.[1] ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించింది. భారతదేశం తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడింది.[2]

జాతీయ స్థాయిలో1974-1978 మధ్యకాలంలో భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెస్టిండీస్‌ జట్లతో ఆడదానికి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ కాలంలో, స్టైలిష్ కుడిచేతి వాటం బ్యాట్స్‌వుమన్ గా ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రం కేంద్ర మండలం (సెంట్రల్ జోన్) మహిళల క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆమె ఇండోర్ విశ్వవిద్యాలయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

జ్యోత్స్నా పటేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జ్యోత్స్నా పటేల్
పుట్టిన తేదీఇండోర్, భారతదేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 13)1976 7 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1976 12 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976కేంద్ర మండలం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 4
బ్యాటింగు సగటు 2.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 2
వేసిన బంతులు -
వికెట్లు -
బౌలింగు సగటు -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు -
క్యాచ్‌లు/స్టంపింగులు 0/-
మూలం: CricketArchive, 2020 26 April

1971-1974 మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఫ్లోర్ హాకీ జట్టుకు కూడా నాయకత్వం వహించింది.

జ్యోత్స్నా పటేల్‌ను భారత ప్రభుత్వం 1972-1978 వరకు స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌తో పాటు నాలుగు సంవత్సరాల భారత ప్రభుత్వ మెరిట్ స్కాలర్‌షిప్‌తో సత్కరించింది.

జ్యోత్స్న టంపా క్రికెట్ లీగ్ కోసం పిల్లలు, మహిళలకు క్రికెట్ శిక్షకురాలుగా ఉంది. టంపా సన్‌రైజర్స్ మహిళల క్రికెట్ జట్టుకు ఉప నాయకురాలి (వైస్-కెప్టెన్) గా, క్రీడాకారిణిగా కూడా ఉంది. ఇటీవల, 2019 అక్టోబరులో ఆమె బోస్టన్, MA లో జరిగిన మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంది.

పటేల్ 2018-2019లో ప్రొఫెషనల్ హూ ఈస్ హూ (who is who) సంస్థ ద్వారా ఆమె వృత్తి, వినోద పరమైన కార్యక్రమాలకు గుర్తింపు పొందింది. ఆమె హ్యాపీ వాండరర్స్ ఇండోర్, మధ్యప్రదేశ్, గుజరాతీ సమాజం సభ్యురాలు.

ఆమె ఇండోర్‌లోని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వారి ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) లకు జీవితకాల సభ్యురాలు.[3]

ఆ తర్వాత పటేల్ అమెరికా వెళ్లింది. 2023లో ఆమె యునైటెడ్ స్టేట్స్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు ఎంపిక సభ్య మండలిలో నియమితురాలయింది.[4] ప్రస్తుతం ఆమె USA క్రికెట్ కమిటీలో సభ్యురాలిగా పనిచేస్తున్నారు. వృత్తిపరంగా, జ్యోత్స్నా పటేల్ 2014 నుండి ఫ్లోరిడాలోని టంపాలోని వరల్డ్ ఫైనాన్షియల్ గ్రూప్‌లో సీనియర్ అసోసియేట్ గా పని చేస్తోంది. జ్యోత్స్నా పటేల్ తన జీవిత లక్ష్యాన్ని ఈ విధంగా పేర్కొంది. "నా లక్ష్యం ప్రపంచంలో బాలికల, మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడం ఇంకా దానిలో భాగం కావడం."[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Jyotsna Patel". Cricinfo. Retrieved 2009-09-16.
  2. "Jyotsana Patel". CricketArchive. Retrieved 2009-09-16.
  3. 3.0 3.1 "Jyotsna Patel". The Cricket Hall of Fame. 4 July 2022. Retrieved 21 August 2023.
  4. Dani, Bipin (8 July 2023). "Ex-India women cricketers Antani and Jyotsna become selectors for Team USA". Mid Day. Retrieved 1 August 2023.