టచ్‌స్క్రీన్

వికీపీడియా నుండి
(టచ్ స్క్రీన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టచ్‌స్క్రీన్ ఉపయోగించి కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తున్న ఒక పిల్లవాడు.

టచ్‌స్క్రీన్ లేదా అంటుతెర అనగా మౌస్, కీబోర్డుని ఉపయోగించడానికి బదులుగా వేలితో లేదా స్టైలస్ పెన్ తో తాకటం ద్వారా ఉపయోగించుకునే కంప్యూటర్ స్క్రీన్. ఒక వ్యక్తి, ప్రత్యేక స్టైలస్ లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్లతో స్క్రీన్ ని తాకడం ద్వారా సరళమైన ఇన్ పుట్ ని ఇవ్వవచ్చు, మల్టీ టచ్ సంజ్ఞల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ప్రదర్శించబడే వాటికి ప్రతిస్పందించడానికి వినియోగదారుడు టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు, ఉదాహరణకు, టెక్స్ట్ పరిమాణాన్ని పెంచడానికి జూమ్ చెయ్యవచు.

గేమ్ కన్సోల్స్, పర్సనల్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లు, పాయింట్ ఆఫ్ సేల్ (POS) సిస్టమ్ లు వంటి పరికరాల్లో టచ్‌స్క్రీన్ సర్వసాధారణం. తరగతి గదుల్లో లేదా కళాశాల ప్రాంగణాల్లో కూడా టచ్ స్క్రీన్ ముఖ్యమైనది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, అనేక రకాల సమాచార పరికరాల యొక్క ప్రజాదరణ సాధారణ టచ్‌స్క్రీన్‌ల డిమాండ్‌ను పెంచుతోంది. టచ్‌స్క్రీన్‌ లు వైద్య రంగంలో, హెవీ ఇండస్ట్రీ, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లు (ఎటిఎమ్ లు) లో కనిపిస్తాయి.

చారిత్రాత్మకంగా, టచ్ స్క్రీన్ సెన్సార్, దాని వెంట ఉన్న కంట్రోలర్ ఆధారిత ఫర్మ్ వేర్ లు ఆఫ్టర్ మార్కెట్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ల ద్వారా లభ్యం అవుతున్నాయి, డిస్ ప్లే, చిప్ లేదా మదర్ బోర్డ్ తయారీదారుల ద్వారా కాదు. డిస్ప్లే తయారీదారులు, చిప్ తయారీదారులు టచ్‌స్క్రీన్‌లను యూజర్ ఇంటర్‌ఫేస్ కాంపోనెంట్‌గా అంగీకరించే ధోరణిని గుర్తించారు, టచ్‌స్క్రీన్‌లను వారి ఉత్పత్తుల యొక్క ప్రాథమిక రూపకల్పనలో అనుసంధానించడం ప్రారంభించారు.