టప్పర్‌వేర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టప్పర్వేర్ బ్రాండ్స్ కార్పొరేషన్
రకం
ప్రజలకు వాటా ఉన్న సంస్థ
వర్తకం చేయబడిందిNYSETUP
ISINUS8998961044 Edit this on Wikidata
స్థాపించబడింది1946 ,ఓర్లాండో,ఫ్లోరిడా
స్థాపకుడుఎర్ల్ టప్పర్
ప్రధాన కార్యాలయం
ఓర్లాండో Edit this on Wikidata
,
ప్రధాన వ్యక్తులు
రిక్ గోయింగ్స్
ఉత్పత్తులుతయారీ, నిర్మాణం, నిల్వ, సేవా ఉత్పత్తులు
జాలస్థలిtupperwarebrands.com

టప్పర్‌వేర్ ప్రపంచ ప్రఖ్యాత వస్తు తయారీ సంస్థ. దీనిని 1946 లో ప్రారంభించారు.1942 లో ఎర్ల్ టప్పర్ తన మొదటి బెల్ ఆకారపు కంటైనర్‌ను అభివృద్ధి చేశాడు; వీరి బ్రాండ్ ఉత్పత్తులను 1948 సంవత్సరంలో ప్రజలకు పరిచయం చేశారు. టప్పర్ వేర్ అను పదము సాధారణంగా మూత కలిగి ఉన్న ప్లాస్టిక్ లేదా గాజు ఆహార నిల్వ పాత్రలను సూచించుటకు వాడుతారు.

టప్పర్‌వేర్ సంస్థ తనే సొంతంగా వస్తు తయారీ చేసి, వాటి మార్కెటింగ్ కూడా స్వంతంగా చేసుకుంటుంది. 2007 సంవత్సరం నాటికి వీరికి దాదాపు 1.9 మిలియన్ డైరెక్టు వస్తు అమ్మకందారులు ఉన్నారు[1].

2013 సంవత్సరం నాటికి ఇండోనేషియా దేశం టప్పర్‌వేర్ అమ్మకాలలో తొలి స్థానంలో ఉన్నది. దాదాపు 200 మిలియన్ డాలర్ వస్తు అమ్మకాలతో ఈ దేశం తొలి స్థానాన్ని సాధించింది. దీని తర్వాత జర్మనీ దేశం అమ్మకాలలో రెండవ స్థానంలో ఉన్నది[2].

సంస్థ చరిత్ర[మార్చు]

టప్పర్ వేర్ పాత్రలు .. 2011 లో తీసిన చిత్రము

టప్పర్‌వేర్‌ను 1946 లో ఎర్ల్ సిలాస్ టప్పర్ (1907–83) లియోమిన్స్టర్, మసాచుసెట్స్ లో అభివృద్ధి చేశారు. [3] అతను ఆహారాన్ని కలిగి ఉండటానికి, గాలి చొరబడకుండా ఉండటానికి గృహాలలో ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లను అభివృద్ధి చేశాడు, ఇది అప్పటి పేటెంట్ పొందిన "బర్పింగ్ సీల్" ను కలిగి ఉంది. టప్పర్ ఇప్పటికే 1938 లో టప్పర్‌వేర్ కోసం ప్లాస్టిక్‌ను కనుగొన్నాడు, కాని పార్టీ నేపధ్యంలో నిర్వహించిన "సేల్ త్రూ ప్రెజెంటేషన్" ఆలోచన ఆవిర్భావంతో ఉత్పత్తి విజయవంతమైంది.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులకు నేరుగా తమ సంస్థ వస్తు ఉత్పత్తుల అమ్మకం అనే మార్కెటింగ్ వ్యూహంతో టప్పర్‌వేర్ సంస్థ ప్రారంభమైనది. తద్వారా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మహిళకు లభించిన స్వేఛ్చా స్వాతంత్రాలకు ఊతం ఇస్తూ వారు మరింత స్వావలంబన సాధించే దిశగా వారిని ఈ సంస్థ ప్రోత్సహించింది.

తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఈ సంస్థ ఎక్కువగా పార్టీ మోడల్ ని అనుసరిస్తుంది. క్రింది చిత్రంలో చూపిన విధంగా ఈ సంస్థ తన ఉత్పత్తులతో, అమ్మకందారులతో కలిసి పార్టీలు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ పార్టీ అంటే అమ్మకం మేళా లాగా అన్నమాట. ఈ మేళా లో టప్పర్ వేర్ యొక్క వివిధ ఉత్పత్తులు ప్రదర్శనకు పెడతారు. ఈ ప్రదర్శనతో రెండు లాభాలు ఉన్నాయి. సంస్థ యొక్క అన్ని ఉత్పత్తులూ వినియోగదారులకు పరిచయం అవుతాయి. అదేవిధంగా నచ్చిన ఉత్పత్తిని అక్కడే కొనవచ్చు.

టప్పర్ వేర్ ప్రచార చిత్రాల్లో చూపబడిన విధంగా 1950 దశకంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మకం మేళా .. అలియాస్ .. పార్టీ

మూలాలు[మార్చు]

  1. Cortese, Amy (July 7, 2007). "Tupperware Freshens Up the Party". The New York Times. Retrieved May 19, 2009.
  2. Cochrane, Joe. "Tupperware's Sweet Spot Shifts to Indonesia". The New York Times. Retrieved April 7, 2015.
  3. "Earl Silas Tupper". Ideafinder.com. Archived from the original on 2013-02-12. Retrieved 2013-02-28.

బయటి లంకెలు[మార్చు]