టికా రామ్ జుల్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టికా రామ్ జుల్లీ

రాజస్థాన్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 జనవరి 2024
ముందు రాజేంద్ర సింగ్ రాథోడ్

సామాజిక న్యాయం, సాధికారత & జైళ్ల శాఖ మంత్రి
పదవీ కాలం
21 నవంబర్ 2021 – 15 డిసెంబర్ 2023

కార్మిక శాఖ (స్వతంత్ర బాధ్యత), ఫ్యాక్టరీ & బాయిలర్‌ల తనిఖీ, సహకార & ఇందిరా గాంధీ కెనాల్ ప్రాజెక్ట్‌ల శాఖల సహాయ మంత్రి
పదవీ కాలం
24 డిసెంబర్ 2018 – 20 నవంబర్ 2021
తరువాత అవినాష్ గెహ్లాట్

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు జైరామ్ జాతవ్
పదవీ కాలం
2008 - 2013
ముందు కొత్త నియోజకవర్గం
తరువాత జైరామ్ జాతవ్
నియోజకవర్గం అల్వార్ రూరల్

కాంగ్రెస్ అల్వార్ జిల్లా అధ్యక్షుడు
పదవీ కాలం
2005 - 2008

వ్యక్తిగత వివరాలు

జననం (1980-09-03) 1980 సెప్టెంబరు 3 (వయసు 44)
కథువస్, నీమ్రానా, అల్వార్, రాజస్థాన్, భారతదేశం
జాతీయత  Indian
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు లేఖ్ రామ్ జుల్లీ, విమ్లా దేవి
జీవిత భాగస్వామి గీతా దేవి
సంతానం 2
పూర్వ విద్యార్థి మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం & రాజస్థాన్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి వ్యాపారం , న్యాయవాది , రాజకీయవేత్త
వెబ్‌సైటు official website

టికా రామ్ జుల్లీ (జననం 3 సెప్టెంబర్ 1980) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అల్వార్ రూరల్ నియోజకవర్గం మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2018 నుండి 2023 వరకు మంత్రిగా పని చేసి, 2024 జనవరి 16 నుండి రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితుడయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

టికా రామ్ జుల్లీ అల్వార్‌లోని బెహ్రోర్ జిల్లా, కతువాస్ గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

టికా రామ్ జుల్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అల్వార్ రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి జగదీష్ ప్రసాద్ పై 8525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో టికా రామ్ కు 35896 ఓట్లు సాధించగా, బిజెపి అభ్యర్థి జగదీష్ ప్రసాద్ కు 27371 ఓట్లు సాధించాడు.[3] టికా రామ్ జుల్లీ 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అల్వార్ రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి జైరామ్ జాతవ్ చేతిలో 26799 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో టికా రామ్ కు 33267 ఓట్లు సాధించగా, బిజెపి అభ్యర్థి జైరాం జాతవ్‌కు 60066 ఓట్లు సాధించాడు.[4]

టికా రామ్ జుల్లీ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అల్వార్ రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మాస్టర్ రాంకిషన్ పై 26477 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో టికా రామ్ కు 85752 ఓట్లు సాధించగా, బిజెపి అభ్యర్థి జగదీష్ ప్రసాద్ కు 59275 ఓట్లు సాధించాడు.[5] ఆయన ఆ తరువాత అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో 24 డిసెంబర్ 2018 నుండి 20 నవంబర్ 2021 వరకు కార్మిక శాఖ (స్వతంత్ర బాధ్యత), ఫ్యాక్టరీ & బాయిలర్‌ల తనిఖీ, సహకార & ఇందిరా గాంధీ కెనాల్ ప్రాజెక్ట్‌ల శాఖల సహాయ మంత్రిగా, 21 నవంబర్ 2021 నుండి 15 డిసెంబర్ 2023 వరకు సామాజిక న్యాయం & సాధికారత & జైళ్ల శాఖ మంత్రిగా పని చేశాడు.[6]

టికా రామ్ జుల్లీ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అల్వార్ రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మాస్టర్ రాంకిషన్ పై 27333 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో టికా రామ్ కు 108,584 ఓట్లు సాధించగా, బిజెపి అభ్యర్థి జైరాం జాతవ్‌కు 81,251 ఓట్లు సాధించాడు.[7] ఆయనను 2024 జనవరి 16న రాజస్థాన్‌ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. India TV (16 January 2024). "Congress appoints Tika Ram Jully as CLP leader in Rajasthan Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  2. The Week (16 January 2024). "Cong appoints Tika Ram Jully as CLP leader in Rajasthan heralds generational change" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  3. infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  4. The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  5. India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  6. The Economic Times (22 November 2021). "Rajasthan Cabinet Reshuffle: The full list of ministers and key highlights". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  7. India TV (3 December 2023). "Rajasthan Election Result 2023: Constituency-wise full list of BJP, Congress, BSP and RLP winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  8. "Tika Ram Jully Profile: राजस्थान में नेता प्रतिपक्ष बनने वाले पहले दलित नेता, जानिए कौन हैं टीकाराम जूली" (in హిందీ). 16 January 2024. Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  9. ThePrint (16 January 2024). "Cong appoints Tika Ram Jully as CLP leader in Rajasthan, heralds generational change". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.