టిన్ టిన్
Jump to navigation
Jump to search
కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల రచయిత, చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల పుస్తకాలు చేశాడు.
టిన్ టిన్ ఒక తెలివైన రిపోర్టర్. ఇతడి సామార్ద్యాలు - పలు భాషలు మాట్లాడటం, నాలుగు చక్రాల వాహనాలను, ద్విచక్ర వాహనాలు విమానాలను, హెలీకాప్టర్లను, ట్యాంక్ లను నడుపడం; కొండలెక్కడం, అడవిలో వెళ్ళగలడం. ఇతని ముఖ్య స్నేహితులు కెప్టెన్ హెడాక్, ప్రొఫెసర్ క్యాలిక్యులస్, థాంసన్, ధామ్సన్. స్నోవీ అనే తెల్లటి కుక్క టిన్ టిన్ కు పంచప్రాణాలు. ఈ కుక్క టిన్ టిన్ సాహసాల్లో పాలుపంచుకుంటూవుంటుంది. టిన్ టిన్ 23 పుస్తకాల్లో ఏ పుస్తకంలోను ఇంటిపేరు ప్రస్తావన, వయసు ప్రస్తావన, కుటుంబీకుల ప్రస్తావన ఉండదు.