టి.ఎం.సెల్వగణపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టి.ఎం.సెల్వగణపతి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన  1991లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1991 నుండి 1996 వరకు జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాడు.[1][2][3]

రాజకీయ జీవితం[మార్చు]

సెల్వగణపతి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికై 1991 నుండి 1996 వరకు జయలలిత మంత్రివర్గంలో స్థానిక పరిపాలనా మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సేలం లోక్‌సభ నియోజకవర్గ నుండి పోటీ చేసి 13వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.

వివాదాలు[మార్చు]

ఫిబ్రవరి 2000న ప్లెజెంట్ స్టే హోటల్ కేసులో ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. 4 డిసెంబర్ 2001న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సెల్వగణపతి 30 మే 2000న కలర్ టీవీ స్కామ్‌లో ట్రయల్ కోర్టుచే దోషిగా నిర్ధారించగా, 4 డిసెంబర్ 2001న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సెల్వగణపతి ఆయన అనుచరులు 1995 నుండి 1996 మధ్య శ్మశానవాటిక షెడ్ల నిర్మాణంలో కుట్ర పన్నారని జవహర్ రోజ్‌గార్ యోజన (జెఆర్‌వై) కింద శ్మశాన వాటికల నిర్మాణంలో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగించారని కేసు వేయడంతో విచారణ అనంతరం 2014లో ప్రత్యేక సీబీఐ కోర్టు జారీ చేసిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ మాజీ రాజ్యసభ ఎంపీ సెల్వగణపతిని మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.[4]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (29 November 2023). "అవినీతి కేసు నుంచి మాజీ మంత్రి విడుదల". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  2. The Hindu (28 November 2023). "Madras High Court sets aside conviction and sentence imposed on former Minister Selvaganapathy in 1995 cremation shed scam case" (in Indian English). Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  3. NDTV (17 April 2014). "First Tamil Nadu politician to be disqualified as MP after conviction". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  4. The Hindu (17 April 2014). "Selvaganapathy convicted for AIADMK era cremation shed scam" (in Indian English). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.