టి.ఎన్.పిళ్ళై
టి.ఎన్.పిళ్ళై | |
---|---|
జననం | సెప్టెంబరు 13 1932 హైదరాబాదు |
మరణం | ఏప్రిల్ 3 2015 హైదరాబాదు |
వృత్తి | పాత్రికేయుడు |
ప్రసిద్ధి | దక్కన్ క్రానికల్ క్రీడాపాత్రికేయుడు |
టి.ఎన్.పిళ్ళై క్రీడాపాత్రికేయ లోకానికి గురువుగా ఖ్యాతికెక్కినవ్యక్తి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన హైదరాబాదులో సెప్టెంబరు 13 1932 న జన్మించారు.[2] వీరు పూర్వీకులు చెన్నై వాస్తవ్యులు. అయితే చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడడంతో ఇక్కడే పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టారు. ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్‌లో సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాలు పనిచేసిన పిైళ్లె పాత్రికేయవృత్తిలో తొలి క్రీడాసంపాదకునిగా రికార్డు సృష్టించారు.ఆయన దక్కన్ క్రానికల్ పత్రికలు క్రీడాపాత్రికేయునిగా 1957నుండి ఉన్నారు.ఆయన 1982 లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలను, 1990లో బీజింగ్లో జరిగిన ఆసియాడ్ క్రీడలను,1987లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ క్రీడలను గూర్చి అనేక వ్యాసాలను అందించారు. ఆయన మంచి క్రీడా నిర్వాహకునిగా గుర్తింపబడ్డారు.
క్రీడాపాత్రికేయ సలహాదారుగానూ సేవలందించిన పిళ్ళై అఖిల భారత పాత్రికేయ సమాఖ్య, ఏపీ క్రీడాపాత్రికేయ సంఘాలను స్థాపించి వాటికి మార్గనిర్దేశనం చేశారు.
ఎ.పి.మహిళా క్రికెట్ సంఘం ఏర్పాటులోకృషి
[మార్చు]2006లో ఏపీ మహిళా క్రికెట్ సంఘం ఏర్పాటులో ఎనలేని కృషిచేసిన పిళ్ళై.ఆ సంఘానికి కార్యదర్శిగా సుదీర్ఘకాలం కొనసాగారు. జాతీయ మహిళల జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు, ప్రస్తుత కెప్టెన్ మిథాలీరాజ్, వేణుగోపాలరావులాంటి క్రికెటర్ల ఎదుగుదలలో పిళ్ళై పాత్ర మరువలేనిది. 1990లో బీజింగ్ నుంచి ఆసియా క్రీడల వార్తలను పిళ్ళై రిపోర్ట్ చేసిన తీరు అద్భుతం.
మరణం
[మార్చు]ఆయన ఏప్రిల్ 3 2015 న తన 86వ సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు.
మూలాలు
[మార్చు]- ↑ "క్రీడాపాత్రికేయ గురువు ఇకలేరు". Archived from the original on 2015-04-06. Retrieved 2015-06-15.
- ↑ "One of the pioneers of sports journalism". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-15.