టి.ఎల్.ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టి.ఎల్.ఎస్ పూర్తి పేరు ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఇది ఓ.ఎస్.ఐ నమూనా లోని ఆరవ పోర అయిన ప్రేసేంటేషన్ లేయర్లో పని చెసే ప్రోటోకాల్. అంతర్జాలములోని సేవలకు-సేవలకు సేవలకు-వినియోగదారులకు మధ్య జరిగే అనేక సంభాషణలకు/లావాదేవీలకు భద్రత కల్పించేందుకు ఈ ప్రోటోకాల్ రూపొందించబడింది. టి.ఎల్.ఎస్ ను మునుపు ఎస్.ఎస్.ఎల్గా కూడా పరిగణించేవారు. భద్రతా సేవలు అందిస్తున్నాయి కాబట్టి వీటిని క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్ లాగా వర్గీకరించవచ్చు. అనేక రకాలైన అప్లికేషన్స్/సేవలు ఈ ప్రోటోకాల్ ఆధారముగా చేసుకుని సురక్షితముగా సేవలను పొందుతూ అందిస్తూ ఉంటాయి.

ఉదాహరణకి ఎచ్.టి.టి.పి.ఎస్ గూడుపట్టులు, ఇమెయిల్ సేవలు, అంతర్జాల ఫ్యాక్స్, త్వరిత సందేశ సేవలు/ఇన్స్టంట్ మేస్సజింగ్, అంతర్జాల వాణి సేవలు/వాయిస్ ఓవర్ ఐ.పి. ఇలా పలు రకాల అంతర్జాల లావాదేవీలకు భద్రత కల్పించటంలో టి.ఎల్.ఎస్. ప్రోటోకాల్ ప్రముఖ పాత్ర పోషిస్తుందనే చెప్పాలి.

టి.ఎల్.ఎస్. అందించే సేవలు[మార్చు]

టి.ఎల్.ఎస్. వినియోగించిన యెడల, మనకు ముఖ్యముగా లభించే సేవలు మూడు.

  • గోప్యత / కాన్ఫిడెన్షియాలిటి
  • లోపరాహిత సమగ్రత/ ఇంటిగ్రిటి
  • విశ్వసనీయత / ఆతెన్టిసిటి

గోప్యత / కాన్ఫిడెన్షియాలిటి[మార్చు]

ఏవేని రెండు అంతర్జాల పరికరాల మధ్య జరిగే సంభాషణని, మార్గ మద్యములో వేరొకరు చూడకుండా, చూసినా అర్ధం కాకుండా చేయడమే గోప్యత యొక్క లక్ష్యం. ఇది ఎన్క్రిప్షన్ అనే ప్రక్రియని అవలంబించడం ద్వారా సాధ్యపడుతుంది. టి.ఎల్.ఎస్ అనేక రకాలైన ఎన్క్రిప్షన్ విధానాల వినియోగం ద్వారా ఈ గోప్యతని సాధిస్తుంది.

ఉదాహరణకి అంతర్జాల సేవలు అందించే సంస్థల వలనడి ఉపకరణాల మీదనే మనం రోజు చెసే అంతర్జాల లావాదేవిలు ప్రయాణిస్తాయి. ఆ ఉపకరణాల మీద మన లావాదేవిల వివరాలు చూడటం సంస్థకి పెద్ద కష్టమైనా పని కాదు. అటువంటి పరిస్థితుల్లో గోప్యత కాపాడుకునేందుకుగాను ఈ టి.ఎల్.ఎస్. ఉపయోగపడుతుంది.

ఇలా అనేకరకాల మార్గ మధ్య సమాచార తస్కరణ దాడులను ఈ టి.ఎల్.ఎస్ వినియోగించడం ద్వారా అరికట్టవచ్చు.

లోపరాహిత్య సమగ్రత / ఇంటిగ్రిటి[మార్చు]

ఏదేని వ్యవస్థలలో జరిగే సంభాషణలు/లావాదేవిలు పూర్తిగా జరగకపోయినా లేదా తప్పుతప్పుగా జరిగిన ఆ సంభాషణకి కార్యార్ధం ఉండదు. గోప్యత ఎంత ముఖ్యమో తప్పులు లేకుండా జరిగే సంభాషణ అంత ముఖ్యం. దీనినే లోపరాహిత సమగ్రత / ఇంటిగ్రిటి అంటారు. హాషింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ సమగ్రతని మనం సాధించవచ్చు.

ఉదాహరణకి నేరగాళ్ళు మనం పంపిన సందేశాన్ని మార్గ మధ్యంలో మార్పు చేసి అవతల వారికి పంపితే, సమాచార గ్రహీత అది మనము పంపిన సందేశముగ పొరపడే ప్రమాదము ఉంది. పైన చెప్పిన గోప్యత ఉన్న తరుణంలో మార్గ మధ్యంలో సందేశం అర్ధవంతంగా ఉండే ఆస్కారం లేదు. అయినప్పటికీ నేరగాడు సమాచారాన్ని మార్చటం ద్వారా గ్రహీతకి అర్ధవంతమైన సమాచారం అందుబాటులేకుండా చేయగలడు.

అటువంటి తరుణంలో ఈ హషింగ్ పద్ధతి పాటించడం ద్వారా గ్రహీతకి మార్గ మద్యంలో ఏదైనా మార్పు జరిగినది లేనిది తెలిసిపోతుంది.