Jump to content

టి.ఎస్‌. ఎలియట్

వికీపీడియా నుండి
టి. ఎస్. ఎలియట్
1934 లో ఎలియట్
పుట్టిన తేదీ, స్థలంథామస్ స్టెర్న్స్ ఎలియట్
(1888-09-26)1888 సెప్టెంబరు 26
సెయింట్ లూయిస్, మిస్సోరీ, అ.సం.రా.
మరణం1965 జనవరి 4(1965-01-04) (వయసు 76)
కెన్సింగ్టన్, లండన్, ఇంగ్లండు
వృత్తికవి, నాటకకర్త, సాహితీ విమర్శకుడు, సంపాదకుడు
పౌరసత్వంAmerican by birth; British from 1927
విద్యAB in philosophy (Harvard, 1909)
PhD (cand) in philosophy (Harvard, 1915–16)[1]
పూర్వవిద్యార్థిహార్వర్డ్ విశ్వవిద్యాలయం మెర్టన్ కళాశాల, ఆక్స్ ఫర్డ్
కాలం1905–1965
సాహిత్య ఉద్యమంఆధునిక కవిత్వం
గుర్తింపునిచ్చిన రచనలు"The Love Song of J. Alfred Prufrock" (1915), The Waste Land (1922), Four Quartets (1943), "Murder in the Cathedral" (1935)
పురస్కారాలుసాహిత్యంలో నోబెల్ (1948), ఆర్డర్ ఆఫ్ మెరిట్ (1948)
జీవిత భాగస్వామి
(m. 1915; sep. 1932)

(m. 1957⁠–⁠1965)

సంతకం

థోమస్ స్టెరన్స్ ఎలియట్ అమెరికాలోని మిస్సోరి ప్రాంతంలో సెంట్‌లూయి గ్రామంలో 1888 సెప్టెంబరు 26వ తేదీన జన్మించాడు.ఆయన్ పూర్వీకులు 17వ శతాబ్దంలో ఇంగ్లాండు నుండి వలసపోయి బోస్టన్ లో స్థిరపడినవారే. తండ్రి వ్యాపారస్తుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

హార్వార్ద్ విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ళు విద్యాభ్యాసం చేసి, 1909లో పట్టాపుచ్చుకున్నాడు, ఎలియట్. తత్వశాస్త్రం పట్ల శ్రద్ధచూపాడు. 1910లో సార్‌బాన్‌లో తత్వము, సాహిత్యము చదివి తిరిగి హార్వార్డ్ లో మరికొంతకాలం చదువుసాగించాడు. 1913లో విశ్వవిద్యాలయ శాఖలో పనిచేసి జర్మనీలో తర్వాత ఆక్స్‌ఫర్డ్ లో ఉన్నతవిద్యనభ్యసించాడు.

1915లో వివాహానంతరం ఇంగ్లాండులో నివాసం ఏర్పరచుకొని ఉండిపోయాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా, తరువాత బ్యాంకులోనూ పనిచేశాక, 1917లో '''ఇగోయిస్ట్ ''' అనే పత్రిక సహాయసంపాదకుడుగా, పిమ్మట '''క్రైటీరియన్''' పత్రికా సంపాదకుడుగా పదేళ్ళు పనిచేశాడు.1917-1920 మధ్యలో రచన మొదలెట్టి ఖండకావ్యాలు ప్రచురించాడు. 1922లో '''బీడునేల''' (The Waste Land) అనే గద్యకావ్యం వెలువడింది. దీనితో ఆధునిక కవితా ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఆయన కీర్తి, ప్రభావమూ పెరుగుతూ వచ్చి ఈనాడు ప్రపంచసాహిత్యంలో అగ్రశ్రేణి కవిగా ఆయన స్థావరం స్థిరపడింది. .1927లో బ్రిటిషు పౌరుడిగా, పౌరసత్వపు హక్కులు పొందాడు.1925నుండి ఫేబర్ ప్రచురణ కర్తల సలహాదారుడిగా ఉన్నాడు. 1930 నుండి ఆయన గేయనాటకాలు రచించడం మొదలెట్టాడు. '''మర్డర్ ఇన్ ద కెథడ్రల్ '''ను 1935లో ప్రదర్సించాడు. ఈ నాటకం ప్రేక్షకుల్ని ఆకర్షించింది. మరి నాలుగు గేయ నాటకాలు వ్రాశాడు. 1944 లో '''ఫోర్ క్వార్టెట్స్''' (Four Quarterts) అనేగేయ సంపుటి వెలువడింది. గతంతో సమంన్వయం కుదుర్చుకోవడానికి సాగించిన నాలుగు యాత్రల కథనం ఇందలి వస్తువు. ఆధునిక విశ్వకవితారంగంలో ప్రముఖ విమర్శకులు ఈ కావ్యాన్ని మాహాకావ్యంగా ఎన్నిక చేశారు.

1920 నుండి సాహిత్య విమర్శ సాగిస్తూ ఎన్నెన్నో వ్యాసాలు వ్రాశాడు. సాహిత్యమే కాక, ఇతర సాంఘిక సమస్యలను పరిశీలిస్తూ గ్రంథాలు వ్రాశాడు. 1948లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ - బిరుదు, నోబెల్ బహుమానం పొందాడు. ఎన్నో విశ్వవిద్యాలయాలు, డాక్టరేట్ బిరుదు నిచ్చి ఎలియట్ ని గౌరవించాయి. మొదటి భార్య చనిపోయిన కొన్ని సంవత్సరాలకి 1957లో '''వాలెరీ ఫ్లెచర్'''ను వివాహమాడాడు. 1965 జనవై 4 వ తేదీన కీర్తిశేషుడైనాడు. సాహిత్యం పట్ల ప్రేమానురాగాలున్న వ్యక్తులెందరో కంట తడిబెట్టుకున్నారు.

1949లో ఎడినబరోలో అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంలో ఎలియట్ వ్రాసిన నాటకాన్ని ప్రదర్సించినప్పుడు ప్రతివళ్ళూ చెప్పుకుంటున్న ఈ ఎలియట్ ఎవర్ండీ? అన్నారుట. ప్రేక్షకులలో ఒకరు. 1930 నుండి వెలువడుతున్న గ్రంథాలలో ఎలియట్ ప్రస్తావన ఉండితీరింది. సాహొత్యం గురుంచి ఏది వ్రాసినా, ఎలియట్ నిర్వచనాన్ని ఉదహరించకుండా ఉండలేరు. ఆయనతో సమాధానం కుదుర్చుకోకుండా ఏ పాశ్చాత్య రచయితకి జరగడం లేదంట.

మూలాలు

[మార్చు]
  1. Jewel Spears Brooker, Mastery and Escape: T.S. Eliot and the Dialectic of Modernism, University of Massachusetts Press, 1996, p. 172.