టి.నిర్మలా రెడ్డి
టి.నిర్మలా రెడ్డి | |||
చైర్మన్
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | గ్యాదరి బాలమల్లు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | తూర్పు జయప్రకాశ్ రెడ్డి | ||
బంధువులు | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | సంగారెడ్డి | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
తూర్పు నిర్మలా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2022లో తెలంగాణ శాసనమండలికి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2024లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]నిర్మలా రెడ్డి 2005లో ప్రభుత్వ హెడ్‌నర్సు ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త తూర్పు జయప్రకాశ్ రెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, 2019లో జరిగిన సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచింది. నిర్మలా రెడ్డి 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆమె 2022లో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా ఎన్నికై మార్చి 2024లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (17 March 2024). "సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ The Hindu (23 November 2021). "Congress fields Nirmala Jagga Reddy, Rayala in MLC elections" (in Indian English). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ Eenadu (18 March 2024). "జిల్లాకు రెండు కార్పొరేషన్ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ The Hindu (17 March 2024). "Telangana government appoints chairpersons to 37 corporations" (in Indian English). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ NT News (8 July 2024). "టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి." Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.