తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
Native name
టీఎస్‌ఐఐసీ
Typeప్రభుత్వం
పరిశ్రమపారిశ్రామిక అభివృద్ధి
స్థాపనజూన్ 2, 2014[1]
ప్రధాన కార్యాలయం6వ అంతస్థు, పరిశ్రమ భవన్, బషీరాబాద్, ,
Areas served
తెలంగాణ
Key people
(ఛైర్మన్), ఈ.వి. నరసింహరెడ్డి (వైస్ ఛైర్మన్)
Number of employees
150
Websiteఅధికారిక వెబ్ సైట్

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఆంగ్లం: Telangana State Industrial Infrastructure Corporation) తెలంగాణ రాష్ట్రం లోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ.[2] ఇది 2014లో ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్లు/షెడ్లు, రోడ్లు, డ్రైనేజ్, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కలిగి గుర్తించి, వాటి అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కృషిచేస్తుంది.[3] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది.[4]

లక్ష్యాలు

[మార్చు]
 • పారిశ్రామిక ప్రమోషన్
 • మౌలిక సదుపాయాల అభివృద్ధి
 • భూసేకరణ
 • ప్రాజెక్ట్ నిర్మాణం

తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం

[మార్చు]

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపార, పరిశ్రమ వర్గాలు ఆతృతతో ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానానికి అసెంబ్లీలో ఆమోదం లభించింది. పరిశోధన నుంచి ఆవిష్కరణ - ఆవిష్కరణ ద్వారా పరిశ్రమ - పరిశ్రమ ద్వారా సమాజ శ్రేయస్సే ఈ నూతన పారిశ్రామిక విధానం లక్ష్యం. పరిశ్రమల స్థాపనతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెంది, నిరుద్యోగ యువతకు ఉపాధి... ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు లాండ్ బ్యాంకును ఏర్పాటు చేసి, సేకరించిన భూమిని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు బదిలీ చేసి ఔత్సాహికులకు కేటాయిస్తారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు రహదారి, విద్యుత్, నీటి వసతి మొదలైన మౌలిక సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. దీనికయ్యే వ్యయం ప్రభుత్వమే భరిస్తుంది. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహంలో భాగంగా తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.75 లక్షల ఎకరాల భూమిలో 20,000కు పైగా ఎకరాల భూమి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా అందుబాటులో ఉంది.[5]

ఇతర వివరాలు

[మార్చు]

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతున్న స్టార్టప్‌లకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ విభాగం కృషిచేస్తోంది. ఆయా స్టార్టప్‌లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసి, ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందిస్తోంది.[6]

నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌

[మార్చు]

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలో తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) తలపెట్టిన నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)కు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు 2022 ఏప్రిల్ 4న జారీచేసింది. దీంతో ఈ ప్రాంతలో పరిశ్రమలు నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది.[7]

బడ్జెట్ వివరాలు

[మార్చు]
 • 2014-15 బడ్జెటులో ఈ విభాగానికి 100 కోట్ల రూపాయలు కేటాయించబడింది.

చైర్మన్లు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. APIIC-Bifurcation[permanent dead link]
 2. TS to roll out new industrial policy in a week
 3. Single-window nod for projects on cards in Telangana
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-22. Retrieved 2017-02-07.
 5. సాక్షి. "నూతన పారిశ్రామిక విధానం". Retrieved 7 February 2017.
 6. "స్టార్టప్‌లకు స్వర్గధామం.. టీఎస్‌ఐఆర్‌ఐఐ". Sakshi. 2022-03-02. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-26.
 7. telugu, NT News (2022-04-05). "నిమ్జ్‌కు లైన్‌క్లియర్‌". Namasthe Telangana. Retrieved 2022-04-04.
 8. NT News (6 December 2023). "టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ పదవికి గ్యాదరి బాలమల్లు రాజీనామా". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
 9. Eenadu (18 March 2024). "జిల్లాకు రెండు కార్పొరేషన్‌ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]