Jump to content

టి. అమర్‌నాథ్ గౌడ్

వికీపీడియా నుండి
టి. అమర్‌నాథ్‌ గౌడ్‌
టి. అమర్‌నాథ్ గౌడ్


త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 నవంబర్ 2022
నియమించిన వారు ద్రౌపది ముర్ము

త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
28 అక్టోబర్ 2021
సూచించిన వారు ఎన్.వి. రమణ
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

పదవీ కాలం
21 సెప్టెంబర్ 2017 – 27 అక్టోబర్ 2021
సూచించిన వారు దీపక్ మిశ్రా
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1965-03-01) 1965 మార్చి 1 (వయసు 59)
సికింద్రాబాద్
పూర్వ విద్యార్థి శివాజీ లా కాలేజీ

తొడుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 11 అక్టోబర్ 2021న త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై,[1] 28 అక్టోబర్ 2021న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టి,[2] త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 2022 నవంబర్ 9న నియమితులయ్యాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

టి. అమర్‌నాథ్‌ గౌడ్‌ 1965 మార్చి 1న హైదరాబాద్‌లో కృష్ణ, సావిత్రి దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి సికింద్రాబాద్‌ సెయింట్‌ ప్యాట్రిక్స్‌ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్ వెస్లీ జూనియర్‌ కాలేజీలో, బేగంపేట ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి, మహారాష్ట్రలోని మరాట్వాడా విశ్వవిద్యాలయం శివాజీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నాడు.[4]

వృత్తి జీవితం

[మార్చు]

టి. అమర్‌నాథ్‌ గౌడ్‌ 1990 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకొని జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య దగ్గర జూనియర్‌గా చేరాడు. ఆయన ఎక్సైజ్, కార్పొరేషన్, కార్మిక కేసులను పెద్ద సంఖ్యలో వాదించాడు. అమర్‌నాథ్‌ గౌడ్‌ హైకోర్టులో అమికస్‌ క్యూరీ, అర్బిట్రేటర్‌, అడ్వొకేట్‌ కమిషనర్‌గా, హైకోర్టు లీగల్‌ సర్వీసు అథారిటీలో న్యాయ సేవలు అందించాడు. ఆయన ఆంద్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా,[5] సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా వివిధ హోదాల్లో పని చేసి, నల్లగొండ జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశాడు.

టి. అమర్‌నాథ్‌ గౌడ్‌ హైకోర్టు, దిగువకోర్టులు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా పని చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టు విభజనలో భాగంగా ఆయనను కేంద్ర న్యాయ శాఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కేటాయించింది.[6] ఆయన 19 సెప్టెంబర్ 2017న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడై,[7] సెప్టెంబర్ 22, 2017న న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8][9]టి. అమర్‌నాథ్‌ గౌడ్‌ 11 అక్టోబర్ 2021న త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు.[10]

పురస్కారం

[మార్చు]

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించగా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[11][12][13]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (12 October 2021). "Justice Amarnath Goud shifted to Tripura HC" (in ఇంగ్లీష్). Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  2. Tripura News Live (28 October 2021). "Justice T Amarnath Goud takes oath as Tripura High Court Justice" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  3. Eenadu (10 November 2022). "త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  4. Sakshi (24 September 2017). "డాక్టర్‌ కావాలనుకుని.. జడ్జినయ్యా!". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  5. The New Indian Express (27 March 2010). "Telangana advocate 'court's success". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  6. Andrajyothy (4 December 2018). "ఏపీకి 14, తెలంగాణకు 11 మంది". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  7. Sakshi (19 September 2017). "ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు". Archived from the original on 19 September 2017. Retrieved 3 September 2021.
  8. "కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం". 21 September 2017. Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  9. India Today (26 November 2020). "Indian Constitution Stood Test Of Time: HC Judge". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  10. The New Indian Express (12 October 2021). "Telangana judge transferred to Tripura HC". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  11. Eenadu (17 November 2024). "జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ సేవలకు గుర్తింపు". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  12. Sakshi (17 November 2024). "వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  13. ETV Bharat News (16 November 2024). "వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ - అత్యధిక కేసులు పరిష్కరించిన వ్యక్తిగా రికార్డ్". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024. {{cite news}}: zero width space character in |title= at position 43 (help)