టి. మోహన్ సింగ్
Jump to navigation
Jump to search
టి. మోహన్ సింగ్ | |
---|---|
జననం | జూలై 17, 1943 వెల్దండ, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము |
ప్రసిద్ధి | రచయిత, హిందీ అధ్యాపకులు |
ఆచార్య టి. మోహన్ సింగ్ ప్రముఖ రచయిత, హిందీ అధ్యాపకులు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]ఆచార్య టి.మోహన్ సింగ్ 1943, జూలై 17న తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో జన్మించారు. హిందీలో ఎం.ఎ, పిహెచ్.డి చేశారు.
పదవి
[మార్చు]ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని భక్తి సాహిత్య పరిశోధనా కేంద్రంలో డైరెక్టర్ గా ఉన్నారు.
ప్రచురించిన గ్రంథాలు
[మార్చు]తెలుగు
- భారతీయ జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీతలు
- ఆశాలయం (కావ్య సంకలనం)
- ఓరామ నీనామ మెంతో రుచిరా -1,2
- కృష్ణం వందే జగద్గురుం -1,2
హిందీ
- సాఠోత్తర్ హిందీ ఉపన్యాస్ ప్రతిపాద్య ఔర్ శిల్ప
- అస్మితాకీ ఖోజ్ (కావ్య సంకలనం)
- హిందీ సాహిత్య్ కా ఇతిహాస్
సంపాదకత్వం వహించిన గ్రంథాలు
[మార్చు]ఆచార్య టి.మోహన్ సింగ్ సంపాదకత్వంలో 24 గ్రంథాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ, ఎస్.సి.ఇ.ఆర్.టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంటర్మీడియెట్ బోర్డు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొరకు 1వ తరగతి నుండి ఎం.ఏ దాకా పాఠ్యపుస్తకాలు.
పరిశోధనా వ్యాసంగాలు
[మార్చు]ఆచార్య టి.మోహన్ సింగ్ మార్గదర్శకత్వంలో 17 మందికి పి.హెచ్.డి 25 మందికి ఎం.ఫిల్ డిగ్రీలు లభించాయి.
బహుమతులు - అవార్డులు
[మార్చు]- ఎం.ఏ. హిందీలో రెండు బంగారు పతకాలు
- ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి
- జన్మభూమి అవారు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
- సాహిత్యా చార్య
- విద్యావాచస్పతి
- మహాత్మగాంధీ మెమోరియల్, జాతీయ బహుమతి
- హిందీ సాహిత్య సమ్మేళన్, అలహాబాదు బహుమతి
- మెగాసిటీ గోల్డన్ జూబ్లీపురస్కార్
- విద్యామార్తాండ్
- హిమాలయ్ ఔర్ హిందుస్తాన్ బహుమతి
- హిందీ సాహిత్య గౌరవ్
- సంపాదక్ శిరోమణి అవార్డు
- విశిష్ట హిందీ సేవీ సన్మాన్
మూలాలు
[మార్చు]- రచయిత పరిచయం, కృష్ణ వందే జగద్గురుమ్ పుస్తకం, 2007 ముద్రణ.