టెంపోరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెంపోరావు
టెంపోరావు
జననంకూరపాటి రామచంద్రరావు
తూర్పు గోదావరి జిల్లా వేలంగి
మరణంజూలై 24, 1985
మద్రాసు
ఇతర పేర్లుకె.ఆర్.రావు
ప్రసిద్ధిడిటెక్టివ్ నవలా రచయిత, టెంపో ఇంగ్లీషు పత్రికా నిర్వాహకుడు
మతంహిందూ
Notes
శ్రీశ్రీ చేత "సాహితీ సామ్రాట్" బిరుదు

టెంపోరావుగా ప్రసిద్ధుడైన "కూరపాటి రామచంద్రరావు" తెలుగు రచయిత. [1] ఇతడు తెలుగులో అపరాధ పరిశోధన సాహిత్యాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగులో "డిటెక్టివ్", "ఫిల్మ్‌" అనే పత్రికలను ఇంగ్లీషులో "టెంపో" అనే పత్రికను నడిపాడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, వేలంగి గ్రామంలో జన్మించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకున్నాడు. మద్రాసులో స్థిరపడ్డాడు. ఇతడు చిన్నతనం నుండే కథలు వ్రాయడం ప్రారంభించాడు. పేరుమోసిన ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి ప్రభావితుడై తెలుగులో రచనలు చేయడం మొదలుపెట్టాడు. ఇతని డిటెక్టివ్ కథలు, నవలలు పాఠకుల ఆదరణను పొందాయి. ఇతడు 350కి పైగా నవలలు రచించాడు. శ్రీశ్రీ ఇతడికి "సాహితీ సామ్రాట్" అనే బిరుదును ఇచ్చాడు.

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]

టెంపోరావు రచించిన డిటెక్టివ్ నవలలలో కొన్ని:

 • వజ్రాల వేట (అనువాదం. మూలం:జేమ్స్ హాడ్లీ ఛేజ్)
 • ఊహించని అదృష్టం
 • త్రిమూర్తులు
 • మెరిసేదంతా మేలిమి కాదు
 • ఇతన్ని నమ్మకండి
 • మిస్టర్ క్యూ
 • మంచి మనిషికి చెడ్డ రోజులు
 • చెడ్డ మనిషికి మంచి రోజులు
 • దెయ్యాలు సిగరెట్లు కాల్చవ్!
 • వంటింటి కుందేలు
 • మిస్టర్ ఆర్
 • నాలో ఏముంది?
 • గజదొంగలు
 • విందుకు వెళ్ళిన విమల
 • అన్వేషణ
 • మిస్టర్ ఎక్స్
 • మిస్టర్ పి
 • సత్యానికి సంకెళ్లా?
 • వయస్సు మళ్ళిన వయ్యారి
 • అనుకున్నంతా అయ్యింది
 • చావు ఖాయం!
 • మేలుకొలుపు
 • మాయమైన మగువలు
 • పునర్జన్మ
 • ఎర్రగులాబీ 66
 • కనిపించని మనిషి
 • మిస్టర్ జెడ్
 • నల్లగులాబీ
 • విషవలయం
 • నకిలీ నాడియా
 • నర్తకి నేరం ఏమిటి?
 • మారని పావలా
 • తొలగిన తెరలు
 • థామస్ జెఫర్సన్ (అనువాదం)

కథలు

[మార్చు]

ఇతని కథలు స్వాతి, అపరాధ పరిశోధన, యువ, కళాసాగర్, జ్యోతి మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతడు రచించిన కథలు కొన్ని[2]:

 • అందమైన యువతి
 • అక్రమ వ్యాపారస్తులూ ఖబడ్దార్!!
 • అడుగో హంతకుడు
 • అన్వేషణ
 • అమాయకుడు
 • అర్ధరాత్రి
 • ఆఖరిక్షణం
 • ఆమెను చంపాలి
 • ఆరోభార్య
 • ఇంటిదొంగ
 • ఈనాటి సావిత్రి
 • ఊహించని అదృష్టం
 • ఎర్రగాజు
 • ఐదులక్షలు
 • ఓ ఆదివారం అనుభవం
 • కనిపించే శవాలు
 • కపటమనిషి
 • కసి
 • కాటేసినయవ్వనం
 • కామపిశాచం
 • కోటీశ్వరుని హత్య
 • గోల్డ్ రింగ్
 • చంపకమాల
 • చిత్రమైనది విధినడక
 • చిదంబరరహస్యం
 • చెల్లాయి పెళ్లి
 • చెల్లెలుపెళ్లి
 • డైమండ్‌రింగ్
 • తోడుదొంగలు
 • దాగనినేరం
 • దేవత
 • ద్రోహి
 • నలుగురుగూండాలు
 • నిజం దాగదు
 • నిశాచరుడు
 • నేరాలు - శిక్షలు
 • నోట్లు
 • న్యూక్లియర్ టెస్ట్
 • పగటిదొంగలు
 • పగిలిన రమ్‌బాటిల్
 • పరివర్తన
 • పరిష్కారం
 • పారిపోయిన హంతకుడు
 • పుస్తకాల పెట్టె
 • పెళ్లికాని పిల్ల
 • ప్రాణమిత్రులు
 • ప్రాణానికి ప్రాణం
 • ప్రేమించిన యువతి
 • ఫోన్‌కాల్
 • బస్సుదోపిడీ
 • బూట్ లెగ్గర్ బుచ్చయ్య
 • భద్రకాళి
 • భయంకరహత్యలు
 • మచ్చలేని మల్లయ్య
 • మదర్
 • మరపురాని మగువ
 • మిడ్ నైట్ మర్డర్
 • ముఖ్యమంత్రిని చంపాలి
 • ముష్టిదాని పాట
 • మూడుఫోటోలు
 • మృత్యుచక్రాలు
 • మొక్కు
 • యాభై వజ్రాలు
 • రాక్షసుడు
 • రాగద్వేషాలు
 • రాధ చావాలి
 • రాధసాహసం
 • రామలీల
 • రోజా
 • రోజుకొక లైలా
 • లక్షకో హత్య
 • లత అండ్ లాల్
 • విదేశీయులు - విగ్రహాలు
 • విషవలయం
 • వేషగాళ్లు - మోసగాళ్లు
 • సగంకాల్చిన చుట్ట
 • సరైన అల్లుడు
 • సిగరెట్‌కేస్
 • సీతాకళ్యాణం

సినిమా రంగం

[మార్చు]

ఇతడు సి.ఐ.డీ.రాజు, గూడుపుఠాణి మొదలైన సినిమాలకు సంభాషణలు వ్రాశాడు. [3]

మరణం

[మార్చు]

ఇతడు 1985, జూలై 24వ తేదీన మద్రాసులో మరణించాడు. [4]

మూలాలు

[మార్చు]
 1. వెబ్ మాస్టర్. "త్రిమూర్తులు". లోగిలి. Retrieved 1 January 2022.
 2. కాళీపట్నం రామారావు. "రచయిత: టెంపో రావు". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 1 January 2022.
 3. వెబ్ మాస్టర్. "Tempo rao". indiancine.ma. Retrieved 1 January 2022.
 4. శివలెంక శంభుప్రసాద్ (23 August 1985). "శ్రీ టెంపోరావు మృతి". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 77 (51): 43. Retrieved 1 January 2022.