Jump to content

టెల్లురియం డయాక్సైడ్

వికీపీడియా నుండి
(టెల్లురియం డయాక్సైడు నుండి దారిమార్పు చెందింది)
టెల్లురియం డయాక్సైడ్

α-TeO2, paratellurite
పేర్లు
ఇతర పేర్లు
Tellurium(IV) oxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7446-07-3]
పబ్ కెమ్ 62638
SMILES O=[Te]=O
ధర్మములు
TeO2
మోలార్ ద్రవ్యరాశి 159.60 g/mol
స్వరూపం white solid
సాంద్రత 5.670 g/cm3(orthorhombic)
6.04 g/cm3 (tetragonal) [1]
ద్రవీభవన స్థానం 732 °C (1,350 °F; 1,005 K)
బాష్పీభవన స్థానం 1,245 °C (2,273 °F; 1,518 K)
negligible
ద్రావణీయత soluble in acid and alkali
వక్రీభవన గుణకం (nD) 2.24
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Sulfur dioxide
Selenium dioxide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

టెల్లురియం డయాక్సైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం.టెల్లురియం డయాక్సైడ్ సంయోగ పదార్థం, టెల్లురియం మూలకం యొక్క ఘన ఆక్సైడ్.టెల్లురియం డయాక్సైడ్ రసాయన సంకేత పదం TeO2.టెల్లురియం డయాక్సైడ్ రెండు భౌతిక రూపాలలో లభించును.ఒకటి పసుపు రంగు ఆర్థోరొంబిక్ ఖనిజం టెల్లురైట్(β-TeO2)కాగా రెండవది సింథటిక్, రంగులేని త్రిభుజాకృతి పారాటెల్లురైట్(α-TeO2).[2] పారాటెల్లురైట్ విశ్లేషణ ద్వారానే అధికంగావీటి రసాయనధర్మాల గురించిన అధ్యయనంలో తెలుసుకున్నారు[3].

తయారు చేయుట

[మార్చు]

టెల్లురియం తో ఆక్సిజన్ రసాయనచర్య వలన పారాటెల్లురైట్(α-TeO2)ఏర్పడును.

Te + O2 → TeO2

మరొక ప్రత్నామ్యాయ ఉత్పత్తి విధానంలో టెల్లురస్ ఆమ్లాన్ని(H2TeO3)నిర్జలీకరించడం.లేదా బేసిక్ టెల్లురియం నైట్రేట్(Te2O4.HNO3)ను 400 °C ఉష్ణోగ్రతకుమించి వేడి చేసిన ఉష్ణవియోగం వలన టెల్లురియం డయాక్సైడ్ ఏర్పడును.

భౌతిక ధర్మాలు

[మార్చు]

టెల్లురియం డయాక్సైడ్ తెల్లని ఘనపదార్థం. టెల్లురియం డయాక్సైడ్ అణుభారం159.60 గ్రాములు/మోల్.అర్థోరొంబిక్ టెల్లురైట్ సాంద్రత 5.670 గ్రాములు/సెం.మీ3. త్రికోణాకృతి పారా టెల్లురైట్ సాంద్రత 6.04 గ్రాములు.సెం.మీ3. టెల్లురియం డయాక్సైడ్ ద్రవీభవన స్థానం732°C(1,350 °F;1,005 K).టెల్లురియం డయాక్సైడ్ బాష్పీభవన స్థానం 1,245 °C(2,273 °F; 1,518 K). టెల్లురియం డయాక్సైడ్ వక్రీభవన సూచిక 2.24

టెల్లురియం డయాక్సైడ్ ద్వారా శబ్దప్రయాణ వేగం 4250 మీటర్లు/సెకండుకు

రసాయన ధర్మాలు

[మార్చు]

టెల్లురియం డయాక్సైడ్ నీటిలో కరుగదు.బలమైనఆమ్లాలలో, క్షారలోహ హైడ్రాక్సైడ్లలో కరుగుతుంది.[4] టెల్లురియం డయాక్సైడ్ ద్విస్వభావయుత రసాయన సమ్మేళనం.అనగా అమ్లాలతో, క్షారాల రెండింటితోనూ రసాయనచర్యలో పాల్గొంతుంది[5].అమ్లాలతో చర్య వలన టెల్లురియం లవణాలు,క్షారాలతోచర్య వలన టెల్లురైట్స్ ఉత్పత్తి అగును.టెల్లురియం డయాక్సైడ్ ను ఆక్సికరించి టెల్లురిక్ ఆమ్లం లేదా టెల్లురేట్స్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.

స్పటిక నిర్మాణం

[మార్చు]

పారాటెల్లురైట్(α-TeO2)అధిక వత్తిడి వద్ద β-,టెల్లురైట్ రూపాన్నిసంతరించుకుంటుంది.పారాటెల్లురైట్, β-టెల్లురైట్ రెండు కూడా త్రికోణద్వి పిరమిడ్ ఆకారం కల్గి, పిరమైడు నాలుగుఅంచులలో ఆక్సిజన్ పరమాణువులుండి,వాటితో నాలుగు టెల్లురియం పరమాణువులు సమసమన్వయ బంధాలు ఏర్పరచుకొని ఉండును.

టెల్లురియం డయాక్సైడ్ 732.6 °C ద్రవికరణ చెంది,ఎర్రని ద్రవంగా ఏర్పడును[6].

ఉపయోగాలు

[మార్చు]

టెల్లురియం డయాక్సైడ్ ను ఆకస్టో-ఆప్టిక్(acousto-optic) పదార్థంగా ఉపయోగిస్తారు.టెల్లురియం డయాక్సైడ్ గాజు అధిక వక్రీభవనసూచిక కల్గిఉన్నది.

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. Pradyot Patnaik (2002). Handbook of Inorganic Chemicals. McGraw-Hill. ISBN 0-07-049439-8.
  2. మూస:Greenwood&Earnshaw1st
  3. W.R.McWhinnie (1995) Tellurium - Inorganic chemistry Encyclopedia of Inorganic Chemistry Ed. R. Bruce King (1994) John Wiley & Sons ISBN 978-0-471-93620-6
  4. Mary Eagleson (1994). Concise Encyclopedia Chemistry. Berlin: Walter de Gruyter. p. 1081. ISBN 3-11-011451-8.
  5. K. W. Bagnall (1966). The Chemistry of Selenium, Tellurium and Polonium. London: Elsevier. pp. 59–60. ISBN 0-08-018855-9.
  6. Egon Wiberg; Nils Wiberg; Arnold Frederick Holleman (2001). Inorganic chemistry. Academic Press. pp. 592–593. ISBN 0-12-352651-5.