టేకుమళ్ళ రాజగోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టేకుమళ్ళ రాజగోపాలరావు విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఇతడు 1876, జూలై 9న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించాడు. విజయవాడలో స్థిరపడ్డాడు. ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.

జానపద వాజ్మయ భిక్షువు గా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు టేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు.

రచనలు[మార్చు]

  • శారదా పద్య వాచకములు (ఏడు భాగాలు)
  • విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల)
  • త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) - 1895 చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
  • ఛందశ్శాస్త్రము
  • మణిభూషణము (సంపాదకత్వం)
  • కనకవల్లి (నవల)
  • ఆంధ్ర దేశీయ కథావళి (మూడు భాగాలు)