Jump to content

టైమ్స్ గ్రూప్ సంస్థ

వికీపీడియా నుండి

బెన్నెట్, కోల్ మన్ అండ్ కంపెనీ లిమిటెడ్( Bennett, Coleman and Company Limited) ( బి.సి.సి.ఎల్, డి/బి/ఎ ది టైమ్స్ గ్రూప్), మహారాష్ట్రలోని ముంబై లో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఒక భారతీయ పత్రికల (మీడియా) సమ్మేళనం తో ఉన్న సంస్థ.[1] ది టైమ్స్ గ్రూప్ లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న సాహు జైన్ కుటుంబం యాజమాన్య వ్యాపారంగా ఉంది.

బెన్నెట్ కోల్ మన్ అండ్ కంపెనీ లిమిటెడ్
రకంప్రైవేట్
పరిశ్రమమాస్ మీడియా
స్థాపన4 నవంబరు 1838 (186 సంవత్సరాల క్రితం) (1838-11-04)
స్థాపకుడుThomas Jewell Bennett Edit this on Wikidata
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
కీలక వ్యక్తులు
ఉత్పత్తులు
రెవెన్యూIncrease 6,986 crore (US$870 million) (FY 2019)[2]
Decrease 153 crore (US$19 million) (FY 2019)[2]
యజమానిసాహు జైన్ కుటుంబం
ఉద్యోగుల సంఖ్య
11,000 (2014)[3]
అనుబంధ సంస్థలు

చరిత్ర

[మార్చు]

ది టైమ్స్ గ్రూప్ అని పిలువబడే బెన్నెట్ కోల్ మన్ & కంపెనీ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటి, భారత దేశంలోని 9 విభిన్న కేంద్రాల నుండి 3 భాషలలో 45 దినపత్రికలు, పత్రికలతో 108 ఎడిషన్లు ప్రచురించబడుతున్నాయి. ఈ సంస్థకు దేశంలో 50 పైగా కార్యాలయాలు,55 పైగా వెబ్ సైట్లు ఉన్నాయి. వివిధ వార్తలు, వినోద ఛానెళ్లను కలిగి ఉంది. ఈ సంస్థ స్వంత విశ్వవిద్యాలయాన్ని కలిగి ఉంది. ఈ సంస్థ సినిమాలు, సంగీతం, సిండికేషన్, విద్య, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రత్యేక ప్రచురణలు,పుస్తకాల వంటి వ్యాపారాలలో నిమగ్నమైంది. మీడియా వ్యాపారం పరంగా, బిసిసిఎల్ టెలివిజన్ ఛానల్స్, రేడియో, డిజిటల్ కంటెంట్ ఉత్పత్తిని నిర్వహిస్తుంది.

ఈ సంస్థ బొంబాయి టైమ్స్, జర్నల్ ఆఫ్ కామర్స్ ప్రచురణను 1838 నవంబరు 4 న ప్రారంభించినప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాగా ఉంది.1892లో ఆంగ్ల పాత్రికేయుడు థామస్ జువెల్ బెన్నెట్, ఫ్రాంక్ మోరిస్ కోల్ మాన్ వార్తాపత్రికను స్వాధీనం చేసుకోవడానికి బెన్నెట్ కోల్ మన్ & కంపెనీ లిమిటెడ్ అనే ఒక జాయింట్ స్టాక్ కంపెనీని స్థాపించారు. బ్రిటిష్ యజమానుల నుండి పారిశ్రామికవేత్త రామకృష్ణ దాల్మియా1946 లో ఈ సంస్థను కొనుగోలు చేశారు, తర్వాత ఆయన అల్లుడు సాహు శాంతి ప్రసాద్ జైన్ ఆధ్వర్యంలో, ఈ సంస్థ పూర్తిగా జైన్ కుటుంబం ఆధీనంలో నడుపబడుతోంది.[4]

ప్రచురణలు

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికతో పాటు , టైమ్స్ గ్రూప్ హిందీ భాష లో ప్రచురించే నవభారత్ టైమ్స్, మరాఠీ భాషలో ప్రచురించే మహారాష్ట్ర టైమ్స్, కన్నడ భాషలో విజయ్ కర్ణాటక, బెంగాలీ భాష లో ఈ సమయ్ సంగ్బాద్పాత్ర వంటివి ఉన్నాయి. టైమ్స్ గ్రూప్ ఇతర ప్రచురణలో ది ఎకనామిక్ టైమ్స్, ముంబై మిర్రర్, బెంగళూరు మిర్రర్, ప్రసార రంగములో టైమ్స్ నౌ, ఎంటర్టైన్మెంట్ నౌ, జూమ్, రేడియో మిర్చి, ఫెమినా మిస్ ఇండియా, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటివి ఉన్నాయి.[5]

అభివృద్ధి

[మార్చు]

టైమ్స్ గ్రూప్ ప్రపంచములో అభివృద్ధి చెందుతున్న మీడియా మార్కెట్ లో ఉన్నది. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ డొమైన్ ల్లో తన స్థానము బలమైన ఉనికి ఉంది. రేడియో మిర్చి,ఫెమినా, ఫిల్మ్ ఫేర్ వంటి ఇతర బ్రాండ్ లు ఆయా రంగాలలో మార్కెట్ లో అగ్రస్థానం లో ఉన్నాయి..

1988 సంవత్సరంలో టైమ్స్ గ్రూప్ 150 వ సంవత్సరముల సందర్భంలో భారత ప్రభుత్వ తపాలా శాఖ వారిచే టైమ్స్ ఆఫ్ ఇండియా స్టాంప్ విడుదల.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆంగ్ల దినపత్రిక, ది ఎకనామిక్ టైమ్స్ వాల్ స్ట్రీట్ జర్నల్ తరువాత ప్రపంచంలోని 2 వ అతిపెద్ద ఇంగ్లీష్ దినపత్రిక. ఈ కంపెనీకి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సుమారు 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు.[6]

శిక్షణ సంస్థ

[మార్చు]

మీడియా రంగంలో నాణ్యతను ప్రోత్సహించే లక్ష్యంతో, టైమ్స్ గ్రూప్ 1985 లో సోషల్ జర్నలిజంలో ఒక సంవత్సరం పాటు ఒక రకమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన, భారతదేశంలోని మీడియా సంస్థ. 1990 లో, ఢిల్లీలో టైమ్స్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (2010 లో టైమ్స్ సెంటర్ ఫర్ మీడియా అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ గా పేరు మార్చబడింది) గా ఏర్పాటు చేసింది టైమ్స్ స్కూల్ ఆఫ్ జర్నలిజం 2010 సంవత్సరంలో ఒక ప్రత్యేక సంస్థగా మార్చబడి, బ్రాండ్ పేరుతో జర్నలిజం ప్రోగ్రామ్ ను అందించడం ప్రారంభించింది.

ఐఎంఈఎస్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అదనంగా టైమ్స్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ బ్రాండ్ కింద మార్కెటింగ్ ఔత్సాహికుల కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది (ఇది 2010 లో టైమ్స్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ - టిఎస్ఎమ్ఎమ్ అని పిలువబడే ఒక ప్రత్యేక సంస్థగా కూడా చేయబడింది). టైమ్స్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లక్ష్యం యువ గ్రాడ్యుయేట్లను మీడియా,మార్కెటింగ్,క్రమశిక్షణ ఇవ్వడం గా దీనిని స్థాపించారు[7] .

మూలాలు

[మార్చు]
  1. "Bennett Coleman & Co Ltd - Company Profile and News". Bloomberg.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-02.
  2. 2.0 2.1 Saini, Sonam (21 November 2019). "BCCL's advertising revenue grows 1.7% in FY19". exchange4media.com.
  3. "Times Group may go for an IPO 'in the long run'". Business Standard. 25 January 2013. Retrieved 3 May 2020.
  4. "The Times Group". india.mom-gmr.org (in ఇంగ్లీష్). Retrieved 2022-08-02.
  5. "A 180+ year Times of India Group journey of Leadership Innovation & Growth". Bennett University (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-02.
  6. "Working at Bennett Coleman and Co. Ltd. (Times Group)". Glassdoor (in ఇంగ్లీష్). Retrieved 2022-08-02.
  7. "The Times Group | About Us". www.timesmediastudies.com. Retrieved 2022-08-02.