Jump to content

యూరో కార్డేటా

వికీపీడియా నుండి
(ట్యూనికేటా నుండి దారిమార్పు చెందింది)

యూరో కార్డేటా
Temporal range: Early Cambrian–Recent
Sea Tulips, Pyura spinifera
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
యూరో కార్డేటా

Giribet et al., 2000
తరగతులు

అసిడియేషియా (2,300 జాతులు)
థాలియేషియా
Appendicularia
Sorberacea

యూరో కార్డేటా (Urochordata) లేదా ట్యునికేటా (Tunicata)కార్డేటాలోని ఉప వర్గము.

సాధారణ లక్షణాలు

[మార్చు]
  • ఇవి ప్రపంచమంతా సముద్రాలలో విస్తరించాయి.
  • అన్ని సముద్రాలలో తీర ప్రాంతము, లోతు జలాలలో జీవిస్తున్నాయి.
  • ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు, కొన్ని ప్లవక జీవులు.
  • ఇవి సరళంగా లేక సహనివేశాలుగా ఉంటాయి.
  • ఇవి వివిధ పరిమాణాలలో (0.25 నుండి 250 మి.మీ.), ఆకారము, వర్ణాలలో ఉంటాయి.
  • డింభక దశ సంక్లిష్టంగా ఉండి ప్రౌఢదశ సరళంగా ఉంటుంది.
  • శరీరాన్ని కప్పుతూ సెల్యులోస్ వంటి పదార్ధమైన ట్యునిసిన్ (Tunicin) రక్షణ కొరకు, కవచము లేక కంచుకముగా ఏర్పడి ఉంటుంది. అందువలన "ట్యునికేటా" అని పేరు వచ్చింది.
  • జలశ్వాస, పృష్ట ఆట్రియల్ రంధ్రము ఉంటాయి.
  • శరీర కుహరము ఉండదు. కాని బహిస్త్వచముతో చుట్టబడిన ఆట్రియల్ కుహరము వెలుపలికి ఆట్రియల్ రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది.
  • పృష్టవంశము డింభకదశలో తోక భాగమునకు పరిమితమై ప్రౌఢదశలో లోపించి ఉంటుంది. అందువలన "యూరో కార్డేటా" అను పేరు వచ్చింది.
  • జీర్ణనాళములో గ్రసని (జలశ్వాసగోణి) ఎండోస్తైల్ తో కూడి అనేక జతల మొప్ప చీలికలను కలిగివుంటుంది.
  • శ్వాసక్రియ కవచము, మొప్పచీలికల వలన జరుగుతుంది.
  • రక్తప్రసరణ వ్యవస్థ వివృత పద్ధతిలో ఉంటుంది. గుండె సరళంగా నాళికాయుతంగా ఉండి, రక్తము ముందుకు వెనుకను ప్రవహిస్తుంది.
  • రక్తము వెనడోసైట్స్ ను కలిగి, సముద్ర నీటి నుండి వెనిడియమ్ ను గ్రహిస్తాయి.
  • విసర్జన క్రియ నాడీ గ్రంధి, జఠర నిర్గమ గ్రంధి, వృక్కకోశము వలన జరుగుతుంది.
  • అభివృద్ధి అప్రత్యక్షంగా ఉండి, నీటిలో స్వేచ్ఛగా ఈదే డింభకదశను కలిగివుంటుంది.
  • ఈ జీవులు తిరోగామి రూపవిక్రియను ప్రదర్శిస్తాయి.
  • ఉభయ లైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక పద్ధతిలో జరుగుతుంది.

వర్గీకరణ

[మార్చు]

ఎస్.ఎమ్.దాస్ (1957) యూరో కార్డేటాను మూడు విభాగాలుగా విభజించెను.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.