అసిడియేషియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసిడియేషియా
కాల విస్తరణ: Cambrian "Stage 3"–Recent (but see text)[1]
Halocynthia sp.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
కార్డేటా
Subphylum:
Class:
అసిడియేషియా

Nielsen, 1995
Orders

అసిడియేషియా (Ascidiacea ; commonly known as the ascidians or sea squirts) యూరో కార్డేటా (Urochordata) తరగతికి చెందిన సముద్రంలో నివసించే జీవ జాతులు. ఇవి ఒక సంచి వలె కనిపించే అకశేరుకాలు. అసిడియన్లు ట్యూనిసిన్ అనే గట్టి పొరను కలిగివుంటాయి.[2]

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇవి తక్కువ లోతున్న నీటిలో లవణాల శాతం 2.5 శాతం కన్నా ఎక్కువ కలిగిన పరిస్థితులలో నివసిస్తాయి. ఇవి స్థానబద్ధ జీవులుగా రాతి మీద అతుక్కొని ఉంటాయి.

వీనిలో సుమారు 2,300 జాతులు మూడు రకాలుగా గుర్తించబడ్డాయి

Ernst Haeckel's interpretation of several ascidians from Kunstformen der Natur, 1904

లక్షణాలు[మార్చు]

  • ఇవి సరళ లేక సహనివేశక జీవులు
  • గ్రసని మీద అడ్డు వరుసలలో ఏర్పడిన శైలికామయ శ్వాసరంధ్రాలు లేక మొప్పచీలికలు ఆట్రియమ్ లోనికి తెరుచుకుంటాయి. ఆట్రియల్ రంధ్రము పృష్టతలములో ఉంటుంది.
  • ఢింబక దశలో పృష్టవంశము తోక భాగములో వుండి, ప్రౌఢ దశలో లోపించి వుంటుంది.
  • శరీరాన్ని కప్పుతూ రక్షణ కొరకు ట్యూనిసిన్ అనే పదార్ధముతో నిర్మితమైన కవచము లేక కంచుకము ఉంటుంది.
  • ప్రత్యుత్పత్తి మొగ్గతొడిగే విధానము వలన జరుగుతుంది. తిరోగామి రూపవిక్రియ ప్రదర్శిస్తాయి.

వర్గీకరణ[మార్చు]

అసిడియేషియా విభాగము రెండు క్రమములుగా విభిజింపబడినది. అవి[3]

ఉదా: అసిడియా, సియోనా

  • క్రమము ప్లూరోగోనా :
  • ఇవి సామూహిక జీవులు
  • శరీరము విభజింపబడి ఉండదు.
  • న్యూరల్ గ్రంధి నాడీసంధికి పృష్టతలము ముందుగాని పార్శ్వముగా గాని ఏర్పడి ఉండును.
  • బీజకోశములు రెండు ఉన్నాయి.

ఉదా: హెర్డ్మేనియా, బోట్రిల్లన్

మూలాలు[మార్చు]

  1. doi:10.1134/S0031030112010042
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  2. "Introduction to Ascidiacea - Sea squirts". nobanis.org. Retrieved 2015-03-03.
  3. "Ascidiacea". animaldiversity.org. Retrieved 2015-03-03.
  • తెలుగు అకాడమీ నుండి సేకరణ