ట్యూబ్‌లైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ట్యూబ్‌లైట్ లేదా గొట్టం బల్బు అధిక కాంతి నిచ్చే ఒక విద్యుత్ దీపము.

Fluorescent lamps
Top, two compact fluorescent lamps. Bottom, two fluorescent tube lamps. A matchstick, left, is shown for scale.

పనితీరు[మార్చు]

మామూలు విద్యుత్ బల్బులలో ఫిలమెంట్ వేడెక్కడం వల్ల కాంతి ప్రసరిస్తుందనే విషయం తెలిసిందే. ట్యూబ్‌లైట్లో అలా జరగదు. పొడవైన గొట్టాల ఆకారంలో ఉండే ఈ లైట్లలో పాదరసపు వాయువు(mercury vapour) నింపుతారు. ఈ వాయు కణాలు విద్యుత్‌శక్తితో ప్రేరేపింపబడి అయనీకరం చెందుతాయి. అప్పుడు ఏర్పడిన వికిరణాల మూలంగా కాంతి ఉత్పన్నమవుతుంది. ఈ వికిరణాలు కంటికి కనిపించని అతినీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు ట్యూబ్‌లైట్ గొట్టం లోపలి గోడలపై పూసిన ఫాస్పర్ పూతపై పడి కంటికి కనిపించే కాంతిగా మారి ఆ ప్రాంతమంతా ప్రసరిస్తుంది. ఇలా వాయువు అయనీకరణం చెందాలంటే అత్యధిక విద్యుత్ వోల్టేజి అవసరమవుతుంది. ఇది ట్యూబ్‌లైట్ స్టార్టర్, చోక్‌ల ద్వారా అందుతుంది. ఒకసారి అయనీకరణం చెందాక ఆపై తక్కువ వోల్టేజి సరిపోతుంది. అందువల్ల స్టార్టర్, చోక్‌ను కటాఫ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మాటిమాటికీ ట్యూబ్‌లైట్‌ను స్విచాన్, స్విచాఫ్ చేస్తుంటే ప్రతిసారీ అధిక వోల్టేజి అవసరమవడంతో అందులోని వాయువు అయనీకరణం చెందే ప్రక్రియకు తరచు అంతరాయం ఏర్పడుతుంది. అందువల్ల ట్యూబ్‌లైట్ జీవితకాలం తగ్గిపోతుంది

బయటి లంకెలు[మార్చు]