Jump to content

రహదారి నియమాలు

వికీపీడియా నుండి
(ట్రాఫిక్ రూల్స్ నుండి దారిమార్పు చెందింది)
తప్పతాగి వేగంగా ప్రయాణిస్తే ఫలితాలు ఇలా ఉంటాయని అందువలన నిదానమే ప్రదానం అని సూచించే ఒక కళాత్మకచిత్రం (తప్పతాగి వాహనం నడపడం నేరం)

రహదారి ప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగి అపారమైన ధన, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. రహదారిని ఉపయోగించే మనమందరం కొన్ని నియమాలను పాటించినట్లయితే చాలా ప్రమాదాల్ని నివారించవచ్చును.

పాదచారులు పాటించవలసిన నియమాలు

[మార్చు]
  • రోడ్డు దాటేప్పుడు ముందు కుడివైపు తర్వాత ఎడమవైపు మళ్ళీ కుడివైపు చూసి దాటాలి.
  • జీబ్రా గుర్తు వున్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
  • ఫుట్ పాత్ లేని చోట్ల రోడుకు కుడి వైపున నడవాలి.
  • ఎప్పుడూ ఫుట్ పాత్ మీదే నడవాలి రోడ్డు మీద కాదు.
  • వాహనాలు నడుస్తున్నపుడు ట్రాఫిక్ ఐలెండ్ (రోడ్డు మధ్యలో వుండే కట్ట) నిండి బయటకు అడుగు పెట్టడం చాలా ప్రమాదం.
  • పోలీసు మనందరి మిత్రుడు సదా అతని సహాయం పొందాలి.
  • పార్క్ చేసి వున్న (నిలిచి వున్న) వాహనముల వెనుక నుండి ఎప్పుడూ పరిగెత్తి వెళ్ళవద్దు.
  • కనపడని రోడ్డు మలుపులు దగ్గర దాటేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా వుండాలి.

కూడలి

[మార్చు]

రహదారి కూడలి వద్ద కొన్ని ప్రత్యేకమైన నియమనిబంధాలు ఉంటాయి. ఎవరు ఎటువైపు ఎలా తిరగాలి అనే విషయం తెలుసుకోవడం అవసరం.

వాహన చోదకులు పాటించవలసిన నియమాలు

[మార్చు]

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడుపరాదు.
టూ వీలర్స్ నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించవలెను.
మద్యం సేవించి వాహనము నడుపరాదు.
సిటీలో ఎయిర్ హారన్, మ్యూజికల్ హారన్ నిషేధం.
ఒన్ వేలో వాహనము నడుపరాదు.
నో పార్కింగ్ ప్రదేశములలో పార్కింగ్ చేయరాదు.
వాహనముల యందు ఎక్కువ శబ్దంతో టేపు రికార్డ్ ఉపయోగించరాదు.
టూ వీలర్స్ పై ఇద్దరుకు మించి ప్రయాణించరాదు.
ఆటో రిక్షాలలో ఎక్కువ మంది పిల్లలను ఎక్కించి స్కూలుకు పంపరాదు.
డ్రైవింగ్ చేయుచూ సెల్ ఫోన్ మాట్లాడరాదు.
వాహనము మలుపు తిరిగేటప్పుడు తప్పనిసరిగా సిగ్నల్ ఇవ్వవలెను.

తప్పక పాటించవలసిన / నియంత్రించే సూచనలు

[మార్చు]

నిబంధనలను సూచించే గుర్తులు ఎక్కువగా గుండ్రంగా వుంటాయి. అవి చూసి జాగ్రత్తగా నడవాలి

ముందు జాగ్రత్తలను / మందలింపులను సూచించే గుర్తులు

[మార్చు]

ముందు జాగ్రత్తలను, మందలింపులను సూచించే గుర్తులు ఎక్కువగా త్రికోణ ఆకారంలో వుంటాయి.

సమాచారాన్ని అందించే సూచనలు

[మార్చు]

సమాచారాన్ని అందించే సూచనలు ఎక్కువగా చతురస్రాకారంలో వుంటాయి.