Jump to content

ఠాకూర్ రాంవీర్ సింగ్

వికీపీడియా నుండి
ఠాకూర్ రాంవీర్ సింగ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 నవంబర్ నవంబర్
ముందు జియా ఉర్ రెహమాన్ బార్క్
నియోజకవర్గం కుందర్కి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
పూర్వ విద్యార్థి హిందూ కళాశాల, మొరాదాబాద్

ఠాకూర్ రాంవీర్ సింగ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో కుందర్కి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఠాకూర్ రాంవీర్ సింగ్ 1993లో భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో మొరాదాబాద్ జిల్లాకు భారతీయ కిసాన్ సంఘ్‌కు కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆయన 2007, 2012, 2017 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కుందర్కి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఠాకూర్ రాంవీర్ సింగ్ 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకుండా, 2024లో కుందర్కి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి హాజీ మహ్మద్ రిజ్వాన్‌పై 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "11 మంది ముస్లింలతో.. ఏకైక హిందూ అభ్యర్థి పోటీ.. గెలిచింది ఎవరో తెలుసా..?". TV9 Telugu. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  2. The Times of India (23 November 2024). "UP Bypolls: Why BJP candidate Ramveer Thakur's Kundarki victory is remarkable". Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  3. "Ramveer Thakur, Only Hindu Candidate In UP's Kundarki Seat, Helps BJP Win After 30 Years" (in ఇంగ్లీష్). News18. 24 November 2024. Retrieved 16 December 2024.
  4. "Kundarki Bypoll Result - November 2024" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.