జియా ఉర్ రెహమాన్ బార్క్
జియా ఉర్ రెహమాన్ బార్క్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | షఫీకర్ రెహమాన్ బార్క్ | ||
---|---|---|---|
తరువాత | ఠాకూర్ రాంవీర్ సింగ్ | ||
నియోజకవర్గం | సంభాల్ | ||
పదవీ కాలం 10 మార్చి 2022 – 3 జూన్ 2024 | |||
ముందు | మహ్మద్ రిజ్వాన్ | ||
తరువాత | ఖాళీ | ||
నియోజకవర్గం | కుందర్కి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సంభాల్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | 1988 జూలై 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | తుబా హఫీజ్ | ||
సంతానం | 1 | ||
పూర్వ విద్యార్థి | చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం (మీరట్) అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం | ||
మూలం | [1] |
జియా ఉర్ రెహమాన్ బార్క్ (జననం 3 జులై 1988) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]జియావుర్ రెహ్మాన్ తన తాత మాజీ ఎంపీ షఫీకర్ రెహమాన్ బార్క్ అడుగుజాడల్లో 26 సంవత్సరాల వయస్సులో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సంభాల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన ఆ తరువాత తన తాతతో కలిసి సమాజ్ వాదీ పార్టీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలలో తన తాత తరుపున ఎన్నికలలో ప్రచారం నిర్వహించాడు.
జియావుర్ రెహ్మాన్ 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కుందర్కి శాసనసభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కమల్ కుమార్ పై 43,162 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎన్నికై,[3] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పరమేశ్వర్ లాల్ సైనీపై 121494 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (5 June 2024). "SP's Zia Ur Rehman wins". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
- ↑ "Uttar Pradesh Assembly Elections 2017: Ziaur Rahman Barq, the 'Young Turk' of Sambhal, may help AIMIM to open its account in UP" (in ఇంగ్లీష్). 2 March 2017. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2024 Loksabha Elections Results - Sambhal". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.