Jump to content

డంకన్ జలసంధి

అక్షాంశ రేఖాంశాలు: 11°2′N 92°35′E / 11.033°N 92.583°E / 11.033; 92.583
వికీపీడియా నుండి
డంకన్ జలసంధి

డంకన్ జలసంధి హిందూ మహాసముద్రంలో గల ఒక జలసంధి. ఇది దాదాపు 48 కి.మీ. వెడల్పు ఉంటుంది. ఈ జలసంధికి ఉత్తరాన రట్లాండ్ దీవి (గ్రేట్ అండమాన్ లో భాగం), దక్షిణాన లిటిల్ అండమాన్ దీవి ఉన్నాయి. డంకన్ జలసంధికి పశ్చిమాన బంగాళా ఖాతం ఉంది. ఈ జలసంధికి తూర్పున అండమాన్ సముద్రం ఉంది. ఈ జలసంధికి అటూ ఇటూ ఎన్నో దీవులున్నాయి. ఉత్తరం నుండి దక్షిణంలో ఈ దీవుల వరుస :

  • ఉత్తర సింక్ దీవి
  • దక్షిణ సింక్ దీవి
  • పాసేజ్ దీవి
  • సిస్టర్ దీవులు
  • ఉత్తర బ్రదర్ దీవి
  • దక్షిణ బ్రదర్ దీవి

ఉత్తర సింక్ దీవికీ, రట్లాండ్ దీవికీ మధ్యలో ఉండే డంకన్ జలసంధిలో భాగమే మానర్ జలసంధి.

పాసేజ్ దీవికీ, సింక్ దీవులకూ మధ్య ఉన్న పాసేజిని ఉత్తర డంకన్ పాసేజి అని చిన్న పాసేజి అనీ అంటారు. నార్త్ బ్రదరు దీవికీ సిస్టరు దీవికీ మధ్య ఉన్న పాసేజిని దక్షిణ పాసేజి అని గ్రేట్ పాసేజి అనీ అంటారు. కెప్టెన్ పి డంకన్ మనీలా వెళ్ళేటపుడు దక్షిణ పాసేజి గుండా వెళ్ళాడు. 1760 లో మనీలా నుండి వెనక్కి వెళ్ళేటపుడు అతడు ఉత్తర పాసేజి గుండా వెళ్ళాడు.[1]

11°2′N 92°35′E / 11.033°N 92.583°E / 11.033; 92.583


మూలాలు

[మార్చు]
  1. హార్స్‌బరో, జేమ్స్ (1817). ఇండియా డైరెక్టరీ, ఆర్, డైరెక్షన్స్ ఫర్ సెయిలింగ్ టు అండ్ ఫ్రమ్ ది ఈస్ట్ ఇండీస్, చైనా, న్యూ హాలండ్, కేప్ ఆఫ్ గుడ్‌హోప్, బ్రెజిల్, అండ్ ది ఇంటర్‌జసెంట్ పోర్ట్స్:కంప్, ఛీఫ్లీ ఫ్రమ్ ఒరిజినల్ జర్నల్స్ ఎట్ ది ఈస్ట్ ఇండియ హౌస్, అండ్ ఫ్రమ్ అబ్సర్వేషన్స్ అండ్ రిమార్క్స్, మేడ్ డ్యూరింగ్ ట్వెంటీ వన్ యియర్స్ ఎక్స్పీరియెన్స్ నేవిగేటింగ్ ఇన్ దోస్ సీస్ (in ఇంగ్లీష్). author, sold. p. 31.