డప్పు ప్రకాశ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డప్పు ప్రకాశ్‌ నక్సలైటు ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు. అతను ‘పల్లె పల్లెన దళిత కోయిల’ అంటూ కలేకూరి ప్రసాద్‌ గీతాలకు తన గొంతుతో జీవం పోస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన కళాకారుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ప్రకాశ్‌ స్వస్థలం తెలంగాణలోని కొత్తగూడెం. ప్రకాశ్‌ అసలు పేరు నలుగోలు శ్రీనివాసరావు. 1985లో నక్సలైట్‌ ఉద్యమం కోసం కృష్ణా జిల్లాకు వెళ్లాడు. ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొన్న సభలో ఆయనతో కలసి పాట పాడాలనుకున్నాడు. కానీ ఆయన తనను వేదిక నుంచి దించేయటంతో అవమాన భారంతో రగిలిపోయాడు. ఆ కసితో కుమారక్క నుంచి ఒగ్గుకథలు, డప్పు రమేశ్‌ను చూసి డప్పు వాయించటం నేర్చుకున్నాడు. దళితులపై ఎక్కడ ఘోరం జరిగిందని తెలిసినా ప్రత్యక్షమైపోయి.. తన పాట, డప్పుతో ప్రజల్ని చైతన్యవంతం చేసేవాడు. ఈ క్రమంలో కారంచేడు, చుండూరు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డప్పు ప్రకాశ్‌గా పేరు సంపాదించాడు.

2017 ఏప్రిల్ 1 న ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ దుకాణం మెట్లపై ఆదివారం ప్రకాశ్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించారు.

మూలాలు[మార్చు]

  1. "దళిత ఉద్యమ కళాకారుడు డప్పు ప్రకాశ్‌ కన్నుమూత". Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]