కారంచేడు ఘటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కారంచేడు ఘటన 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు మరియు ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.[1] తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.

చరిత్ర మరియు ఘటన[మార్చు]

కారంచేడు గ్రామం ప్రకాశం జిల్లాలోని చీరాలకు 7 కిమీల దూరంలో ఉంది. 16 వార్డులున్న గ్రామ పంచాయితీతో ఆ గ్రామ వ్యవస్థ పెద్దది. కమ్మ కులస్తులు 8 వార్డులలో నివసించే వారు. మిగితా ఎనిమిది వార్డుల్లో బీసీ, ఎస్‍సీ మరియు ఎస్‍టీ కులాల వారు ఉండే వారు. దళితులు 16వ వార్డులో ఉండేవారు. ఈ ఘటన జరిగిన రోజుల్లో సమసమాజ సిద్ధాంతాలు ఇంకా ఆ గ్రామానికి పాకలేదు. అగ్ర కులాల వారు నిమ్న కులాలను తక్కువ చేసి చూడటం సర్వ సాధారణం.

మూలాలు[మార్చు]

  1. http://www.hindu.com/lr/2008/12/07/stories/2008120750190500.htm

ఇతర లింకులు[మార్చు]