డబ్బు టుది పవరాఫ్ డబ్బు
డబ్బు టుది పవరాఫ్ డబ్బు నవలను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాశారు. బహుళ ప్రజాదరణ పొందిన ఈ నవల ఛాలెంజ్ సినిమాగా రూపుదిద్దుకుంది.[1]
న్యాయబద్దంగా అయిదు సంవత్సరాల్లో యాభై లక్షలు సంపాదిస్తానని ఒకమ్మాయి తండ్రితో పందెం కట్టిన యువకుని కథ యిది. న్యాయానికి చట్టానికి ఉన్న తేడాను తెల్పుతూ డబ్బు సంపాదించటంలో వివిధ రకాలయిన మెళకువలనీ అసాంతేం తెలియజెప్పిన తొలి తెలుగు నవల. ఎంతో మంతి పాఠకులకు ప్రేరణ కలిగించి నిలదొక్కుకోవడానికి సహాయపడిన ఈ నవల మరెంతో పరిశోధనాత్మక రచయితలకు మార్గదర్శకమయింది. ఆర్థిక శాస్త్రాన్నీ, న్యాయశాస్త్రాన్ని కలబోసిన ఈ నవల ప్రతీ పేజీలోనూ ఉత్కంఠ కలిగిస్తుంది.
కథ
[మార్చు]కోటేశ్వరుడు రాజారామమోహన్‌రావు తో ఒక యువకుడు (గాంధీ) 'నిజానికి డబ్బు సంపాదనే ధ్యేయం అయితే అయిదు సంవత్సరాల్లో ఓ యాభై లక్షలు సంపాదించటం పెద్ద కష్టం కాదు.'' అంటాడు. 'ఆయన బిగ్గరగా నవ్వి' "అయితే సంపాదించు చూద్దాం. అలాగేగానీ సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా'' అన్నాడు. పక్క గదిలో అతని కుమార్తె హారిక ఈ పందేనికి ఉలిక్కిపడింది. ఇక్కడ గాంధీ కూడా ఉలిక్కిపడ్డాడు. చట్టబద్ధంగా, న్యాయ పరిధిలోనే ఐదేళ్లలో యాభైలక్షలు సంపాదిస్తానంటూ కోటేశ్వరుడు రాజారామమోహన్‌రావుతో పందెంకాసిన గాంధీ తాను అనుకున్న గడువులో పందెం నెగ్గుతాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Wirally, Team; Wirally, Team. "11 Yendamuri Veerendranath novels that were made into movies! - Wirally". wirally.com/ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-10-09. Retrieved 2020-09-11.
- ↑ "Dabbu To The Power Of Dabbu - డబ్బు టు ది పవరాఫ్ డబ్బు by Yandamuri Veerendranath - Dabbu To The Power Of Dabbu". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2018-08-15. Retrieved 2020-09-11.