డామ్ స్మాల్ లినక్స్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
అభివృద్ధికారులు | జాన్ ఆండ్రూస్, ఇతరులు |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యూనిక్స్ తరహా |
పనిచేయు స్థితి | సచేతనం |
మూల కోడ్ విధానం | ఓపెన్ సోర్స్ |
ఇటీవల విడుదల | 4.4.10 / నవంబరు 18, 2008 |
Latest preview | 4.11 రిలీజ్ క్యాండిడేట్ 2 / సెప్టెంబరు 26, 2012 |
లైెసెన్స్ | స్వేచ్ఛా లైసెన్సులు (ముఖ్యాంగా GPL) |
అధికారిక జాలస్థలి | అధికార జాలస్థలి |
డామ్ స్మాల్ లినక్స్ (DSL సంక్షిప్త రూపం) లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ. ఇది ఇంటెల్ x86 ఆధారిత కంప్యూటర్ల కోసం రూపొందించబడింది. ఇది గ్నూ జీపీఎల్ లైసెన్స్ ద్వారా అందుబాటులో ఉన్న నివ్య. ఇది పాత తక్కువ జ్ఞప్తి గల వాడుకలో లేని కంప్యూటర్లను పునరుత్తేజింప చేసి వాడుకునేలా చేసేందుకు ఈ నివ్య ఉపయోగపడుతుంది. ఉదాహరణకి Intel 80486. DSLని ఒక లైవ్ సీడీగా కూడా వాడవచ్చు. 50 ఎంబీలో పట్టే నిర్వహణా వ్యవస్థ ఉంటుందా అన్న కుతూహలం ద్వారా పుట్టిన నివ్య ఈ డీఎసెల్. చిన్నపాటి పెన్ డ్రైవ్ లో ఇట్టే పట్టేస్తుంది.
చరిత్ర
[మార్చు]DSL అసలు జాన్ ఆండ్రూస్ ద్వారా మొదలుపెట్టి, నిర్వహించబడింది. ఐదేళ్ళ పాటు డామ్ స్మాల్ లినక్స్ సమూహం దీనిని నిర్వహించింది. రాబర్ట్ షింగిల్ డెకర్ అనే సభ్యుడు MyDSL వ్యవస్థ, DSL కంట్రోల్ పేనల్ లాంటివి రూపొందించాడు. కొన్ని విఆదాల కారణంగా రాబర్ట్ ఈ ప్రాజెక్టును వీడారు.[1]. ఇతను ప్రస్తుతం టినీ కోర్ లినక్స్ మీద పనిచేస్తున్నారు.
DSL నిజానికి నాపిక్స్ లోనే మరో రకం, మోడల్-కేని 22 ఎంబీకి అణిచివేసి తయారుచెయ్యబడింది. కానీ నాపిక్స్ నుండే నేరుగా ఆ తరువాతి రోజుల్లో రూపొందించారు.
కంప్యూటర్ అవసరాలు
[మార్చు]DSL కేవలం x86 ఆధారిత కంప్యూటర్ ల మీదనే పనిచేస్తుంది. కనీస వ్యవస్థ అవసరాలు : Intel 80486 ప్రొసెసర్, 8 ఎంబీ ర్యామ్. DSL వాడి డిల్లో అనే విహారిణిలో అంతర్జాల పేజీలు చూడొచ్చు, చిన్ని చిన్ని ఆటలు ఆడవచ్చు, పాటలు ఆడించవచ్చు. మొజిల్లా ఫైర్ఫాక్స్ లాంటి విహారిణి వాడాలంటే కొంచె ఎక్కువ జ్నప్తి కావాలి.
విశేషాలు
[మార్చు]2014 జూలై నాటి 4.4.10 DSL రూపాంతరం లో, ఈ కింద తెలుపబడిన నిక్షిప్తాలున్నాయి:
- పాఠ్య కూర్పరులు: బీవర్, నానో, విమ్
- దస్త్ర వ్యవస్థ: డీఎఫెం, ఎమెల్‍ఎఫ్‍ఎం
- గ్రాఫిక్స్: ఎంటీపెయింట్. xzgv బొమ్మల ప్రదర్శిని
- మల్టిమీడియా: జీఫోన్.ఈంపెగ్ 1 సపోర్ట్ తో
- ఆఫీస్ : ఎస్ఐఏజీ ఆఫీస్, టెడ్ వర్డ్ ప్రొసెసర్, స్పెల్ చెకర్ తో, ఎక్స్ పీడీఎఫ్ వ్యూయర్
- అంతర్జాలం:
- విహారిణులు: డిల్లో, మొజిల్లా ఫైర్ఫాక్స్, నెట్రిక్
- సిల్ఫ్డ్ (ఈమెయిల్ క్లైంట్)
- నైమ్ (ఏఓఎల్, ఐసీక్యూ, ఐఆర్సీ క్లైంట్)
- AxyFTP (ఫైళ్ళ దిగుమతి/ఎగుమతి కోసం), BetaFTPD (FTP సర్వర్)
- మంకీ (జాల శోధన)
- సర్వర్ మెసేజ్ బ్లాక్ క్లైంట్
- ఇతర సాఫ్టువేర్లు
రూపాంతరాలు
[మార్చు]విడుదల తేదీలు
[మార్చు]రూపాంతరం | తేదీ |
---|---|
1.0 | 2005-04-13 |
1.1 | 2005-05-05 |
1.2 | 2005-06-07 |
1.3 | 2005-07-14 |
1.4 | 2005-08-02 |
1.5 | 2005-09-06 |
2.0 | 2005-11-22 |
2.4 | 2006-05-16 |
3.0 | 2006-06-20 |
3.1 | 2006-11-29 |
3.2 | 2007-01-18 |
3.3 | 2007-04-03 |
3.4 | 2007-07-03 |
4.0 | 2007-10-23 |
4.1 | 2007-12-02 |
4.2 | 2007-12-18 |
4.3 | 2008-04-22 |
4.4 | 2008-06-09 |
జనితాలు
[మార్చు]డామ్ స్మాల్ లినక్స్ ఆధారిత జనిత నివ్యలు
- హికారాయునిక్స్
- డామ్ వల్నరబుల్ లినక్స్
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Interview with Robert Shingledecker, creator of Tiny Core Linux". DistroWatch Weekly, Issue 295. DistroWatch. 23 March 2009.
- ↑ "డిస్ట్రో వాచ్ : డామ్ స్మాల్ లినక్స్".