డారిల్ టఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డారిల్ టఫ్ఫీ
Daryl Tuffey (1).jpg
డారిల్ రేమండ్ టఫ్ఫీ (2014)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డారిల్ రేమండ్ టఫ్ఫీ
పుట్టిన తేదీ (1978-06-11) 1978 జూన్ 11 (వయసు 46)
మిల్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 209)2001 31 March - Australia తో
చివరి టెస్టు2010 19 March - Australia తో
తొలి వన్‌డే (క్యాప్ 116)2000 27 September - Zimbabwe తో
చివరి వన్‌డే2010 28 November - India తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.14 (prev. 37)
తొలి T20I (క్యాప్ 10)2005 17 February - Australia తో
చివరి T20I2010 26 February - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2012/13Northern Districts
2007/08–2011/12Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 26 94 91 220
చేసిన పరుగులు 427 295 1,438 868
బ్యాటింగు సగటు 16.42 9.51 17.11 12.57
100లు/50లు 0/1 0/0 0/6 0/0
అత్యుత్తమ స్కోరు 80* 36 89* 38*
వేసిన బంతులు 4,877 4,333 16,607 10,490
వికెట్లు 77 110 288 265
బౌలింగు సగటు 31.75 32.12 26.78 31.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 10 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 6/54 4/24 7/12 5/21
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 20/– 41/– 52/–
మూలం: Cricinfo, 2017 27 March

డారిల్ రేమండ్ టఫ్ఫీ (జననం 1978, జూన్ 11) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. అంతర్జాతీయంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించాడు. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ నైట్స్ కోసం దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 2012, సెప్టెంబరు 14న క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి టఫ్ఫీ రిటైర్ అయ్యాడు.[1]

జననం

[మార్చు]

టఫ్ఫీ 1978, జూన్ 11న ఒటాగోలోని మిల్టన్‌లో జన్మించాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

క్రిక్‌ఇన్‌ఫో జర్నలిస్ట్ లిన్ మెక్‌కానెల్ టఫీని "అతను వేసిన మొదటి ఓవర్‌లోనే వికెట్లు తీయడంలో అద్భుతమైన ప్రవృత్తి" ఉన్న బౌలర్‌గా అభివర్ణించాడు.[2] 1999-00లో ఆస్ట్రేలియాపై వికెట్లేమి తీయకుండా 127 పరుగులు ఇచ్చాడు, కానీ అతని తర్వాతి మ్యాచ్‌లో తన మొదటి టెస్ట్ వికెట్లు తీశాడు. ఆఖరి రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో ఆఖరి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

2000-01లో పాకిస్తాన్‌తో టఫ్ఫీ స్వదేశంలో తన మొదటి పూర్తి టెస్ట్ సిరీస్ ఆడాడు.[3] ఆఖరి టెస్ట్‌లో 77 పరుగులకు ఏడు వికెట్లు తీసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోసహా సిరీస్‌లో టఫ్ఫీ పదహారు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ ఒక ఇన్నింగ్స్, 185 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

పాకిస్తాన్‌తో మొత్తం ఐదు వన్డేలు కూడా ఆడాడు. వన్డే సిరీస్‌లో పదమూడు వికెట్లతో ముగించి సిరీస్‌లో న్యూజీలాండ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[4] పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో నేపియర్‌లో 24 పరుగులకు కెరీర్‌లో అత్యుత్తమ 4 వికెట్లు తీసి, మరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

టఫ్ఫీ 2007-08 సీజన్ కోసం ఆక్లాండ్ ఏసెస్ కోసం ఆడాల్సి ఉంది. కానీ సిడ్నీలో క్లబ్ క్రికెట్ ఆడేందుకు దానిని తిరస్కరించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Daryl Tuffey retires from all cricket". ESPNcricinfo. Retrieved 16 November 2021.
  2. డారిల్ టఫీ at ESPNcricinfo, retrieved 3 February 2006
  3. Cricinfo – Statsguru – DR Tuffey – Tests – Innings by Innings list[permanent dead link], from Cricinfo, retrieved 3 February 2006
  4. Pakistan in New Zealand, 2000/01 One-Day Series Averages, Usa.cricinfo.com, retrieved 3 February 2006
  5. Tuffey turns down Auckland deal, from Cricinfo, retrieved on 23 October 2007

బాహ్య లింకులు

[మార్చు]