Jump to content

డా. బి.ఆర్. అంబేద్కర్ మహాశిల్పం

వికీపీడియా నుండి
సామాజిక న్యాయ మహాశిల్పం
(డా. బి.ఆర్. అంబేద్కర్ మహాశిల్పం)
తుది మెరుగులు దిద్దుకుంటున్న స్మృతివనం
ప్రదేశంస్వరాజ్య మైదానం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రూపకర్తఎంఎస్‌ అసోసియేట్‌ సంస్థ
రకంశిల్పం
నిర్మాన పదార్థంకాంస్యం
ఎత్తు125 అడుగులు
బరువు120 మెట్రిక్‌ టన్నులు
నిర్మాణం ప్రారంభండిసెంబరు 2021
పూర్తయిన సంవత్సరంజనవరి 2024
ప్రారంభ తేదీ19 జనవరి 2024 (2024-01-19)
అంకితం చేయబడినదిభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్

సామాజిక న్యాయ మహాశిల్పం (ఆంగ్లం: Statute of Social Justice) అనేది విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాం.[1] దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2024 జనవరి 19న ప్రారంభించి జాతికి అంకితం చేసాడు.[2]

రూపకల్పన

[మార్చు]

రూ.404 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. ఇందులో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు. కాగా, తయారీకి 120 మెట్రిక్‌ టన్నుల కాంస్యంతో పాటు 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వినియోగించారు. ఈ విగ్రహ పీఠం కింది భాగం 81 అడుగులు ఉంది. ఇందులో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్‌లు నిర్మించారు. ఇందులో ఒక సినిమా హాలుతో పాటు అంబేడ్కర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంటాయి.[3] కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో దీనిని రూపొందించారు.

స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్‌ టన్నుల రాజస్థాన్‌ పింక్‌ ఇసుక రాయిని, అక్కడక్కడ పాలరాతిని వినియోగించారు. ఇందులో చిన్నారులకు ఆటస్థలం, ఉద్యానవనం, వాటర్‌ ఫౌంటెయిన్లు, ఫుడ్‌కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయి.

సామాజిక న్యాయ మహాశిల్పం (ఎం జి మార్గం నుండి)

మూలాలు

[మార్చు]
  1. "సామాజిక న్యాయ మహాశిల్పం ఇది | andhra pradesh cm jagan unveil 125 foot tall ambedkar statue vijayawada on january 19 - Sakshi". web.archive.org. 2024-01-19. Archived from the original on 2024-01-19. Retrieved 2024-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీలా | Statue of Liberty". web.archive.org. 2024-01-20. Archived from the original on 2024-01-20. Retrieved 2024-01-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "19న అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం |". web.archive.org. 2024-01-19. Archived from the original on 2024-01-19. Retrieved 2024-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)