డియర్ మేఘ
డియర్ మేఘ | |
---|---|
దర్శకత్వం | ఎ. సుశాంత్ రెడ్డి |
నిర్మాత | అర్జున్ దాస్యన్ |
తారాగణం | అరుణ్ అదిత్ మేఘా ఆకాష్ అర్జున్ సోమయాజులు |
ఛాయాగ్రహణం | ఐ.ఆండ్రూ బాబు |
సంగీతం | గౌర హరి |
నిర్మాణ సంస్థ | వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ |
విడుదల తేదీ | 3 సెప్టెంబర్ 2021 |
సినిమా నిడివి | 121 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డియర్ మేఘ 2021లో రూపొందిన రోమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాకు ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అరుణ్ అదిత్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021 సెప్టెంబరు 3న విడుదలైంది.
చిత్ర నిర్మాణం
[మార్చు]డియర్ మేఘ లోని ‘ఆమని ఉంటే పక్కన’ లిరికల్ సాంగ్ ను నటి పూజా హెగ్డే 16 జులై 2021న విడుదల చేసింది.[1] ఈ సినిమా టీజర్ ను 22 జులై 2021న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]మేఘ (మేఘ ఆకాష్) బీటెక్ చదువుతున్నప్పుడు అర్జున్ (అర్జున్ సోమయాజుల) ను ప్రేమిస్తుంది. తన మనసులోని మాటను అతనికి చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ, చెప్పలేక పోతుంది. అర్జున్ చదువు పూర్తయ్యాక ఉద్యోగరీత్యా సింగపూర్ వెళ్లిపోయి మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చి ముంబైలో తిరిగి మేఘ ముందు ప్రత్యక్షమై తాను మేఘను ప్రేమిస్తున్నట్టు చెబుతాడు. ఇద్దరూ సంతోషంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఓ ప్రమాదంలో ఇద్దరూ గాయపడతారు. బ్రెయిన్ డెడ్ అయిన అర్జున్ మామూలు మనిషి కావడం కావడం అసాధ్యమన్న ఉద్దేశంతో అతను చనిపోయాడని మేఘా తల్లిదండ్రులు అబద్ధం చెబుతారు. ఈ బాధలో ఆత్మహత్యకు సిద్ధమైన మేఘాకు అనుకోకుండా ఆది (అదిత్ అరుణ్) పరిచయం అవుతాడు. ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో అర్జున్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- అరుణ్ అదిత్ [4]
- మేఘా ఆకాష్ [5]
- అర్జున్ సోమయాజులు
- పవిత్ర లోకేష్
పాటల జాబితా
[మార్చు]- ఆమని ఉంటే , రచన: కృష్ణకాంత్ , గానం. అనురాగ్ కులకర్ణి
- బాగుంది ఈ కాలమే, రచన: కృష్ణకాంత్, గానం. సిద్ శ్రీరామ్
- చూసా నిన్ను చూశా, రచన: కృష్ణకాంత్, గానం. సాహితి
- గుండెల్లో కన్నీటి మేఘం, రచన: కృష్ణకాంత్, గానం . హరిణి
- కష్టం వస్తే నాకు , రచన: కృష్ణకాంత్, గానం.గౌరహరి.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్
- నిర్మాత: అర్జున్ దాస్యన్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ సుశాంత్ రెడ్డి
- సంగీతం: గౌర హరి
- సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ బాబు
- పాటలు: కృష్ణ కాంత్
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- ఆర్ట్ డైరెక్టర్: పీఎస్ వర్మ
- పీఆర్వో – జీఎస్‌కె మీడియా
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (16 July 2021). "'డియర్ మేఘ' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
- ↑ Namasthe Telangana (22 July 2021). "డియర్ మేఘ టీజర్ విడుదల". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Eenadu (3 September 2021). "Dear Megha Review: రివ్యూ: డియర్ మేఘ". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
- ↑ 10TV (8 June 2021). "అరుణ్ అదిత్ పుట్టిన రోజున 'డియర్ మేఘ' సెకండ్ లుక్.. | Dear Megha" (in telugu). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (5 February 2021). "మేఘా ఆకాశ్.. 'డియర్ మేఘ'". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.