డి.టి.యస్.మధుసూదన్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.మధుసూదన్‌రెడ్డి
జననం
మరణంఏప్రిల్ 20 2015
హైదరాబాదు
ఇతర పేర్లుడి.టి.యస్.మధుసూదన్‌రెడ్డి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినీపరిశ్రమలో సౌండ్ ఇంజనీరు
జీవిత భాగస్వామిశశె
పిల్లలుసాయిదత్తా,ధనుంజయరెడ్డి

పి.మధుసూధనరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సౌండ్ ఇంజనీర్.[1] ఆయన డి.టి.యస్.మధుసూదన్‌రెడ్డి గా సినీ పరిశ్రమలో సుపరిచితుడు.

జీవిత విశేషాలు[మార్చు]

కడప జిల్లా పులివెందుల ఆయన స్వస్థలం.

సినీ ప్రస్థానం[మార్చు]

ఆయన సౌండ్ డిజైనింగ్‌లో విప్లవాత్మక మార్పులతో తెలుగు సినిమారంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గోవిందా గోవిందా చిత్రంతో రీరికార్డింగ్ అసిస్టెంట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సిసింద్రీ సినిమాతో ఆడియోగ్రాఫర్‌గా మారారు. 23 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో దాదాపు 130 సినిమాలకు సౌండ్ రికార్డిస్ట్, డీటీఎస్ మిక్సింగ్ ఇంజినీర్, ఆడియోగ్రాఫర్‌గా పనిచేశారు. తమ్ముడు, కలిసుందాం రా, మురారి, ఒక్కడు, నువ్వునేను, అతడు, బొమ్మరిల్లు, అరుంధతి, రాజన్న, కిక్, మిర్చి, మనం సినిమాలు ఆయనకు చక్కటి గుర్తింపును తీసుకొచ్చాయి. సమకాలీన తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ సాంకేతిక నిపుణుల్లో ఒకరిగా పేరుగాంచారు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మధుసూదన్‌రెడ్డికి భార్య (శశి), ఇద్దరు పిల్లలు(సాయిదత్తా,ధనుంజయరెడ్డి) ఉన్నారు.[3]

మరణం[మార్చు]

మధుసూదన్‌రెడ్డి(48) ఏప్రిల్ 20 2015 న ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు.[4]

మూలాలు[మార్చు]

  1. madhusudhanreddy-nomore.20 April 2015
  2. "DTS Madhusudhan Reddy passes away". hans india. 2015-04-21.
  3. Telugu movies audio designer Madhusudhan Reddy dead
  4. "డి.టి.యస్.మధుసూదన్‌రెడ్డి ఇకలేరు". నమస్తే తెలంగాణ. 2015-04-21. Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-16.

ఇతర లింకులు[మార్చు]