డి.రవీందర్ యాదవ్

వికీపీడియా నుండి
(డి.రవీందర్‌ యాదవ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డి.రవీందర్‌ యాదవ్‌
జననం
దండెబోయిన రవీందర్‌ యాదవ్‌

జాతీయత భారతదేశం
వృత్తిఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌

డి.రవీందర్‌ యాదవ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

డి.రవీందర్‌ యాదవ్‌ జనగామ జిల్లా, జనగాం మండలం, వడ్లకొండ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[4]

వృత్తి జీవితం[మార్చు]

డి.రవీందర్‌ యాదవ్‌ 1990లో ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా నియమితులయ్యాడు. ఆయన ఓయూ పోస్టు గ్రాడ్యుయేట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, మహత్మాగాంధీ యూనివర్సిటీలో సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా, సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కోఆర్డినేటర్‌గా పని చేశాడు. నిజాం కాలేజీ, ఓయూ పీజీ కాలేజీల్లోనూ కొంతకాలం పని చేశాడు. ఆయన కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ ఇన్‌ అకడమిక్‌ ప్రోగ్రాంలో శిక్షణ పొందాడు. రవీందర్‌ యాదవ్‌ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సమయంలోనే ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[5][6][7]

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు[మార్చు]

డి.రవీందర్‌ యాదవ్‌ 2021, మే 24న ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 27 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 27 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 27 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  5. Namasthe Telangana (22 May 2021). "నలుగురు వీసీలు బడుగుల నుంచే". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  6. Eenadu (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  7. The Hans India, The Hans (23 May 2021). "Telangana Government appoints new V-Cs to State universities". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  8. Namasthe Telangana (24 May 2021). "ఓయూ, శాతవాహన వీసీలను సన్మానించిన విప్ సుమన్‌". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.