డూడుల్4గూగుల్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Doodle4Google Logo.gif
2010 డూడుల్4గూగుల్‌ పోటీ లోగో.

డూడుల్ 4 గూగుల్‌ లేదా స్టైల్జిడ్ డూడుల్4గూగుల్‌ అనేది గూగుల్ హోం పేజీలో చూపబడే లోగో సృష్టించడానికి పిల్లలతో గూగుల్ సంస్థ నిర్వహిస్తున్న ఒక వార్షిక పోటీ.

2014 డూడుల్ ఫర్ గూగుల్[మార్చు]

గూగుల్ 2014లో భారతదేశంలోని 50 నగరాల్లో చిన్నారులకు నిర్వహించిన 'డూడుల్ ఫర్ గూగుల్‌' చిత్రలేఖనం పోటీల్లో వైదేహీరెడ్డి విజేతగా నిలిచింది. డూడుల్ కోసం గూగుల్‌ భారతదేశంలో "భారతదేశంలో నేను పర్యటించాలనుకుంటున్న ప్రదేశం" అనే అంశంపై జరిపిన చిత్రలేఖన పోటీల్లో పది లక్షల మంది చిన్నారులు పాల్గొన్నారు. డూడుల్ చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న వైదేహి 'సహజం, సాంస్కృతిక స్వర్గం-అసోం' అనే అంశం మీద వేసిన చిత్రలేఖనం "డూడుల్ ఫర్ గూగుల్"గా ఎంపికైంది. వైదేహీ వేసిన ఈ చిత్రలేఖనం బాలల దినోత్సవం అయిన 14-11-2014న గూగుల్ హోంపేజీలో గూగుల్ భారతదేశపు డూడుల్ గా ప్రదర్శితమైంది. గూగుల్ సంస్థ బాలల దినోత్సవం అయిన ఇదే రోజున వైదేహీకి అవార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా బహుమతిగా అందజేసింది, అలాలే మూడు రోజుల అసోం పర్యటనకు ఏర్పాట్లు చేసింది, ఇదే రోజున వైదేహీ పుట్టినరోజు కావడం విశేషం.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 15-11-2014 ("డూడుల్ ఫర్ గూగుల్" విజేత తెలుగమ్మాయి)