Jump to content

డెస్మండ్ టుటు

వికీపీడియా నుండి
డెస్మండ్ టుటు
జననం
డెస్మండ్‌ టుటు

(1931-10-07)1931 అక్టోబరు 7
కలంకిడోర్ఫ్, దక్షిణాఫ్రికా
మరణం2021 డిసెంబరు 26(2021-12-26) (వయసు 90)
కేప్‌ టౌన్‌, దక్షిణాఫ్రికా
విద్యకింగ్స్ కాలేజీ, లండన్ యూనివర్సిటీ
వృత్తి
  • బిషప్
  • ఆధ్యాత్మిక నేత
  • మానవ హక్కుల ఉద్యమకారుడు
  • రచయిత
అంతకు ముందు వారుఫిలిప్ రస్సెల్
తరువాతివారుఅంజోంగొంకులు నడుంగనే
జీవిత భాగస్వామి
నోమాలిజో లేహ్ టుటు
(m. invalid year)
పిల్లలు4
సంతకం

డెస్మండ్‌ టుటు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బిషప్‌, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాటం చేసిన హక్కుల కార్యకర్త. డెస్మండ్ టుటు దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1991 వరకు దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రజల వర్ణ వివక్షా విధానాలపై పోరాటాలు చేశాడు. ఆయన చేసిన పోరాటానికి గాను ఆయనకు 1984లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఆయన 2006 అక్టోబరులో మహాత్ముని 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి భారత ప్రభుత్వం అవార్డును అందుకున్నాడు.

జీవిత నేపథ్యం

[మార్చు]

డెస్మండ్ టుటు జోహన్నెస్‌బర్గ్‌, క్లెర్క్స్‌డోర్ప్ పట్టణంలో 1931 అక్టోబరు 7న జన్మించాడు. ఆయన 1950లో ఉన్నత విద్యాభాస్యం 1954లో దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. టుటు మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు. టుటు 1955 జూలై 2 న నోమాలిజో లేయాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆతర్వాత 1985-86 మధ్య కాలంలో జోహన్నెస్‌బర్గ్‌ బిష్‌ప్‌గా, 1986 నుంచి 1996 వరకు కేప్‌టౌన్‌ ఆర్చి బిష్‌ప్‌గానూ, మొదటి నల్లజాతి బిషప్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన దక్షిణాఫ్రికాలో 1980 మధ్యకాలంలో నల్లజాతీయులపై క్రూరమైన అణచివేతకు, జాతివివక్షకు వ్యతిరేకంగా, ఎల్జీబీటీల హక్కుల కోసం ఆయన అవిశ్రాంత పోరాట చేశాడు.[1]

మరణం

[మార్చు]

డెస్మండ్‌ టుటు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ కేప్‌టౌన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 డిసెంబరు 26న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. ERAD. "డెస్మండ్ టుటు - జీవిత చరిత్రలు - 2022". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Andhrajyothy (27 December 2021). "నల్లజాతి ఉద్యమకారుడు డెస్మండ్‌ టుటు కన్నుమూత". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
  3. BBC News తెలుగు (26 December 2021). "డెస్మండ్ టుటు: దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేక హీరో అస్తమయం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  4. Eenadu (26 December 2021). "నోబెల్‌ శాంతి బహుమతిగ్రహీత డెస్మండ్‌ టుటు కన్నుమూత". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.