డేటా రికవరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంప్యూటింగ్ లో డేటా రికవరీ అనేది సాధారణ విధానంలో వాటి నిల్వ డేటా పొందటం సాధ్యం కానప్పుడు, పాడైన లేదా దెబ్బతిన్న సెకండరీ స్టోరేజీ, రీమూవబుల్ మీడియా లేదా ఫైళ్ల నుండి లభ్యంకాని డేటా దక్కించుకునే ఒక ప్రక్రియ. ఈ డేటా తరచుగా అంతర్గత లేదా బాహ్య హార్డ్ డిస్క్ డ్రైవ్స్ (HDDలు) సాలిడ్-స్టేట్ డ్రైవ్స్ (SSDలు) యుఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్స్, అయస్కాంత టేపులు, సిడిలు, డీవీడీలు, RAID ఉపవ్యవస్థలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వంటి స్టోరేజ్ మీడియా నుండి దక్కించుకోవడం జరుగుతుంది. అత్యంత సాధారణ డేటా రికవరీ దృష్టాంతంలో ఆపరేటింగ్ సిస్టమ్ వైఫల్యం, నిల్వ పరికరం యొక్క వైఫల్యం, అకస్మాత్తుగా దెబ్బతిన్నవి లేదా తొలగింపబడినవి, మొదలైనవి (సాధారణంగా సింగిల్-డ్రైవ్, సింగిల్-పార్టిషన్, సింగిల్-ఆపరేటింగ్ సిస్టమ్ లో) ఉంటాయి, ఈ సందర్భంలో లక్ష్యం అనేది సింపుల్‌గా అన్ని అవసరమైన పైళ్లను మరొక డ్రైవ్ నుంచి కాపీ చేసుకోవడం.

సాధారణంగా కంప్యూటరులో ఏదైనా ఫైలు డిలేట్ చేయబడినప్పుడు అది రీసైకిల్‌బిన్ లోకి చేరుతుంది, తొలగించగించబడిన దానిని తిరిగి పొందాలనుకుంటే కంప్యూటరు డెస్క్‌టాప్‌పై ఉన్న రీసైకిల్‌బిన్ ఒపెన్ చేసి అందులో ఉన్న వాటిలో తిరిగి పొందాలనుకున్న ఫైలుపై రైట్ క్లిక్ చేసి వచ్చిన ఆప్షన్ లలో రీస్టోర్ పై క్లిక్ చేయాలి, అప్పుడు ఆ ఫైలు ఎక్కడ డిలేట్ చేయబడిందో అదే స్థానంలో పునరుద్ధరింపబడుతుంది. రీసైకిల్ బిన్ లో కూడా డిలేట్ చేయబడిన దానిని తిరిగి పొందాలనుకుంటే ప్రత్యేకంగా డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ ఒపెన్ చేసి అందులో అడిగిన వాటికి తగు సమాచారం నింపుతూ ముందుకెళ్లినట్లయితే కోల్పోయిన ఫైళ్లను తిరిగి పొందవచ్చు.