డేనియల్ కాల్టాగిరోన్
డేనియల్ కాల్టాగిరోన్ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు, నిర్మాత |
జీవిత భాగస్వామి | మెలానీ సైక్స్
(m. 2001; div. 2009) |
డేనియల్ కాల్టాగిరోన్ (ఆంగ్లం: Daniel Caltagirone; 1972 జూన్ 18) ఆంగ్ల నటుడు.[1] ది బీచ్ (2000), లారా క్రాఫ్ట్ టోంబ్ రైడర్: ది క్రెడిల్ ఆఫ్ లైఫ్ (2003), ఆస్కార్ పురస్కారం విజేత చిత్రం ది పియానిస్ట్ (2002)లలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. టెలివిజన్ సిరీస్ లాక్ స్టాక్‌లో తన పాత్రకు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]డేనియల్ కాల్టాగిరోన్ లండన్‌లో పుట్టి పెరిగాడు. అక్కడ ఎన్‌ఫీల్డ్‌లోని సెయింట్ ఇగ్నేషియస్ కాలేజీలో ఆయన చదివాడు. చిన్నతనంలో ఆయన న్యూయార్క్ నగరంలో ఎక్కువ సమయం గడిపాడు.
ఆయన 1997లో గిల్డ్‌హాల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా నుంచి పట్టభద్రుడయ్యాడు.[2] అక్కడ చివరి సంవత్సరంలో ఆయన ఐటీవి టాలెంట్ స్కౌట్ ద్వారా గుర్తించబడ్డాడు. రూత్ రెండెల్ రూపొందించిన గోయింగ్ రాంగ్‌లో ఆయన లీడ్ రోల్ పోషించాడు.
మాజీ భార్య మెలానీ సైక్స్‌తో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.[3][4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమా
[మార్చు]1998 | లెజియన్‌నైర్ |
2000 | ది బీచ్ |
2000 | మ్యాడ్ అబౌట్ మాంబో |
2002 | ది పియానిస్ట్ |
2002 | ది ఫోర్ ఫెదర్స్ |
2003 | లారా క్రాఫ్ట్: టోంబ్ రైడర్ – ది క్రెడిల్ ఆఫ్ లైఫ్ |
2006 | ది ఫెయిల్ |
2006 | ఆఫ్టర్... |
2010 | ది రీడ్స్ |
2011 | లిప్ స్టిక్కా |
2012 | అవుట్‌పోస్ట్: బ్లాక్ సన్ |
2013 | కన్వీనియన్స్ |
2015 | డఫ్ |
2016 | స్మోకింగ్ గన్స్ |
2016 | ఎలిమినేటర్స్ |
2020 | అసలైన గ్యాంగ్‌స్టర్ |
2023 | డెవిల్ (TBA) |
2023 | తంగలన్ (తమిళం) |
మూలాలు
[మార్చు]- ↑ Daniel Caltagirone profile, independenttalent.com; accessed 3 December 2017.
- ↑ A Clockwork Orange — The Guildhall School of Music and Drama, 13 March 1997.
- ↑ "Melanie Sykes, 50, stuns fans with incredible workout body". HELLO! (in ఇంగ్లీష్). 2020-11-09. Retrieved 2021-08-19.
- ↑ "Mel Sykes breaks up with Italian husband". independent (in ఇంగ్లీష్). Retrieved 2021-08-19.