Jump to content

డేల్ కార్నెగీ

వికీపీడియా నుండి
డేల్ కార్నెగీ
దస్త్రం:Dale Carnegie.jpg
పుట్టిన తేదీ, స్థలంDale Harbison Carnagey
(1888-11-24)1888 నవంబరు 24
మేరీవిల్లే, మిస్సౌరీ, అమెరికా
మరణం1955 నవంబరు 1(1955-11-01) (వయసు 66)
Forest Hills, New York, U.S.
సమాధి స్థానంBelton, Missouri, U.S.
వృత్తిరచయిత, ఉపాధ్యాయుడు
పూర్వవిద్యార్థిUniversity of Central Missouri
గుర్తింపునిచ్చిన రచనలుHow to Win Friends and Influence People
How to Stop Worrying and Start Living
జీవిత భాగస్వామి
Lolita Baucaire
(m. 1927; div. 1931)
(m. 1944)
సంతానం2

సంతకం

డేల్ కార్నెగీ ఒక అమెరికన్ రచయిత, వ్యక్తిత్వ వికాసం, అమ్మకాలు (సేల్స్), కార్పొరేట్ శిక్షణ, బహిరంగ ఉపన్యాసాలు మొదలైన విషయాలు బోధించే ఉపాధ్యాయుడు. అమెరికాలోని మిస్సౌరీలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన స్వయంశక్తితో రచయితగా ఎదిగాడు. 1936 లో ఈయన రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్ (How to win friends and influence people) అనే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పుస్తకం జనంలో ఆదరణ పొందుతూ ఉంది. ఇదే కాక How to stop worrying and start living (1948), Lincoln the unknown (1932) అనే పుస్తకాలు కూడా రాశాడు. ఎవరైనా సరే సాధన ద్వారా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవచ్చు అని అతని రచనల్లోని సారాంశం.[1]


మూలాలు

[మార్చు]
  1. "Books by Dale Carnegie (Author of How to Win Friends and Influence People)". www.goodreads.com. Retrieved 2021-03-24.